ఎంత మోహమో మీకు నిట్టే బతుకరయ్య
(॥పల్లవి॥)
ఎంత మోహమో మీకు నిట్టే బతుకరయ్య
సంతసపువేళ మీకు చవి చెరిచితిఁగా
(॥॥)
యిద్దరు నొక్కపచ్చడ మిటు గట్టుక మీరు
అద్దరిపాటు నే రాఁగా అట్టేలోఁగేరు
వొద్దు వొద్దు మీకునేల వూరకే వట్టిభయము
గద్దరి నేం బుద్ది మీకు కంటైతిఁగా
(॥॥)
చూపుల మీ రిద్దరూను సొరిదిఁ గరఁగుకొంటా
యేపున నుండఁగఁ నే నేలవస్తినో
రాపుల నాకుఁగా మీరు రహిఁ దియ్య నింతయేల
తీపుల మీగుండెలకు దిగులైతిఁగా
(॥॥)
ముంచి యిద్దరునుఁ గూడి ముచ్చటలే యాడుకోఁగా
యెంచక పొడచూపితి నిట్టేనేను
అంచెల శ్రీ వేంకటేశ అలమేలుమంగను నే
మంచమెక్కి కూడుటకు మనసైతిఁగా
(||pallavi||)
ĕṁta mohamo mīgu niṭṭe badugarayya
saṁtasabuveḽa mīgu savi sĕrisidim̐gā
(||||)
yiddaru nŏkkabachchaḍa miḍu gaṭṭuga mīru
addaribāḍu ne rām̐gā aṭṭelom̐geru
vŏddu vŏddu mīgunela vūrage vaṭṭibhayamu
gaddari neṁ buddi mīgu kaṁṭaidim̐gā
(||||)
sūbula mī riddarūnu sŏridim̐ garam̐gugŏṁṭā
yebuna nuṁḍam̐gam̐ ne nelavastino
rābula nāgum̐gā mīru rahim̐ diyya niṁtayela
tībula mīguṁḍĕlagu digulaidim̐gā
(||||)
muṁchi yiddarunum̐ gūḍi muchchaḍale yāḍugom̐gā
yĕṁchaga pŏḍasūbidi niṭṭenenu
aṁchĕla śhrī veṁkaḍeśha alamelumaṁganu ne
maṁchamĕkki kūḍuḍagu manasaidim̐gā