Emta mohamo kaani idamdu neemeemdanu

ఎంత మోహమో కాని ఇతఁడు నీమీఁదను
Language

(॥పల్లవి॥)
ఎంత మోహమో కాని ఇతఁడు నీమీఁదను
సంతతముఁ బాయకిటు సరుస నున్నాఁడు

(॥ఎంత॥)
పలుకవే పతితోడ పగడవాతెర దెరచి
చిలుకవే సెలవులను చిరునవ్వులు
మొలకసిగ్గులివేల మోనంబు లింకనేల
కలయికకు వచ్చి ఇదె కాచుకొ న్నాఁడు

(॥ఎంత॥)
కనుఁగొనవె వొకమాఁటు కలువకన్నుల నితని
పెనఁగవే క్క(క?) రములను ప్రియము చల్లి
పొనిఁగేటి తమకమేల పొసఁగి గుట్టిఁకనేల
నినుఁగదియువేడుకను నిలుచున్నవాఁడు

(॥ఎంత॥)
కొసరవే యావేళ కూరిములు సారెకును
విసరవే సణఁగు లిటు వేమారును
వెస రతుల మరిగి శ్రీవేంకటేశుఁడుఁ గూడి
సుసరమున నీతోడఁజొక్కు చున్నాఁడు

(||pallavi||)
ĕṁta mohamo kāni idam̐ḍu nīmīm̐danu
saṁtadamum̐ bāyagiḍu sarusa nunnām̐ḍu

(||ĕṁta||)
palugave padidoḍa pagaḍavādĕra dĕrasi
silugave sĕlavulanu sirunavvulu
mŏlagasiggulivela monaṁbu liṁkanela
kalayigagu vachchi idĕ kāsugŏ nnām̐ḍu

(||ĕṁta||)
kanum̐gŏnavĕ vŏgamām̐ṭu kaluvagannula nidani
pĕnam̐gave kka(ka?) ramulanu priyamu salli
pŏnim̐geḍi tamagamela pŏsam̐gi guṭṭim̐kanela
ninum̐gadiyuveḍuganu nilusunnavām̐ḍu

(||ĕṁta||)
kŏsarave yāveḽa kūrimulu sārĕgunu
visarave saṇam̐gu liḍu vemārunu
vĕsa radula marigi śhrīveṁkaḍeśhum̐ḍum̐ gūḍi
susaramuna nīdoḍam̐jŏkku sunnām̐ḍu