Emta mogamodi yunnaa neṟamgavu nee yamta

ఎంత మొగమోడి యున్నా నెఱఁగవు నీ యంత
Language

(॥పల్లవి॥)
ఎంత మొగమోడి యున్నా నెఱఁగవు నీ యంత-
పొంతనె నా కిఁక నీవు బుద్ధి చెప్ప వలెనా

(॥ఎంత॥)
మనసు నొవ్వదు గదా మాటలాడే నీతోను
విను నిజ మాడెటి వెఱ్ఱిదానను
తనివోక వాడవారిఁ దమకాలు రేఁచి వచ్చి
యెనసి నాతో నవ్వేవు యేది నిజ మయ్యా

(॥ఎంత॥)
సిగ్గు వడవు గదా చెలులఁ దారుకాణించే
కగ్గి కల్ల కోరువనిగబ్బిదానను
వెగ్గళించి వీరి వారి వెంటనె పెట్టుక వచ్చి
అగ్గ మైనవాఁడ నంటా నాన వెట్టే వయ్యా

(॥ఎంత॥)
నెలవి నవ్వవు గదా చేతిలోనే వాసి చూపే
వలచి యెగ్గెంచని భావపుదాననూ
కొలఁది మీఱఁగ నన్నుఁ గూడితి శ్రీవెంకటేశ
అలమేలుమంగను నే నట్టె కావవయ్యా

(||pallavi||)
ĕṁta mŏgamoḍi yunnā nĕṟam̐gavu nī yaṁta-
pŏṁtanĕ nā kim̐ka nīvu buddhi sĕppa valĕnā

(||ĕṁta||)
manasu nŏvvadu gadā māḍalāḍe nīdonu
vinu nija māḍĕḍi vĕṭridānanu
tanivoga vāḍavārim̐ damagālu rem̐si vachchi
yĕnasi nādo navvevu yedi nija mayyā

(||ĕṁta||)
siggu vaḍavu gadā sĕlulam̐ dārugāṇiṁche
kaggi kalla koruvanigabbidānanu
vĕggaḽiṁchi vīri vāri vĕṁṭanĕ pĕṭṭuga vachchi
agga mainavām̐ḍa naṁṭā nāna vĕṭṭe vayyā

(||ĕṁta||)
nĕlavi navvavu gadā sedilone vāsi sūbe
valasi yĕggĕṁchani bhāvabudānanū
kŏlam̐di mīṟam̐ga nannum̐ gūḍidi śhrīvĕṁkaḍeśha
alamelumaṁganu ne naṭṭĕ kāvavayyā