ఎంత మొగమాయకాఁడ వే మందు నిన్ను
(॥పల్లవి॥)
ఎంత మొగమాయకాఁడ వే మందు నిన్ను
పంతము నెరపఁ బోయి పైకొంటి నేను
(॥ఎంత॥)
నే నిన్నుఁ గోపగించితే నీవు నవ్వితి వందుకు
మోనాన నంతలోన నే మొక్కే నిదె
ఆనుకొని మేటిదొర వన్నిటికి నేరుతువు
కాని మ్మని యీ పనికె కరఁగితి నేనూ
(॥ఎంత॥)
అవ్వలిమోము నే నైతే నడ్డాలు వచ్చేవు నీవు
మువ్వంక నే నిందుకుఁగా మొక్కే నిదె
రవ్వ సేసి భోగించ రంటికి వత్తువు నీవు
యివ్వల నీ వినయాల కియ్యకొంటి నేను
(॥ఎంత॥)
కడుగుట్టు నేఁ జేసితే కాఁగిలించుకొంటి విట్టె
ముడిదీరె నిటమీఁద మొక్కే నిదె
ఆడరి శ్రీవెంకటేశ అందగాఁడ కూడితిని
జడియక మెచ్చి మెచ్చి సత మైతి నేనూ
(||pallavi||)
ĕṁta mŏgamāyagām̐ḍa ve maṁdu ninnu
paṁtamu nĕrabam̐ boyi paigŏṁṭi nenu
(||ĕṁta||)
ne ninnum̐ gobagiṁchide nīvu navvidi vaṁdugu
monāna naṁtalona ne mŏkke nidĕ
ānugŏni meḍidŏra vanniḍigi neruduvu
kāni mmani yī panigĕ karam̐gidi nenū
(||ĕṁta||)
avvalimomu ne naide naḍḍālu vachchevu nīvu
muvvaṁka ne niṁdugum̐gā mŏkke nidĕ
ravva sesi bhogiṁcha raṁṭigi vattuvu nīvu
yivvala nī vinayāla kiyyagŏṁṭi nenu
(||ĕṁta||)
kaḍuguṭṭu nem̐ jeside kām̐giliṁchugŏṁṭi viṭṭĕ
muḍidīrĕ niḍamīm̐da mŏkke nidĕ
āḍari śhrīvĕṁkaḍeśha aṁdagām̐ḍa kūḍidini
jaḍiyaga mĕchchi mĕchchi sada maidi nenū