Emta mogamaayabumam demi dechchugomtivo

ఎంత మొగమాయపుమం దేమి దెచ్చుకొంటివో
Language

(॥పల్లవి॥)
ఎంత మొగమాయపుమం దేమి దెచ్చుకొంటివో
అంతటి నీ సుద్దులెల్ల అన్ని యు మఱచెను

(॥ఎంత॥)
ఆపసోపమున నీవు అందుండి వచ్చినవేళ
ఆపె నీతో నవ్వినది అరుదు గాదా
కోపముతోనే వుండె కోరి యిందాఁకా నైతే
యేపున నీమోము చూచి యింతలో మఱచెను

(॥ఎంత॥)
వింతచెమటలతోడ విసరించుకొనేవేళ
పంతాన నాపె చేకొనె భాగ్యము గాదా
చింతించె నీచేఁత లెల్ల చెలిచే విని యిందాఁకా
మంతనాన నిన్నాడేటిమాటలు మఱచెను

(॥ఎంత॥)
కందువఁ గరఁగి నీవు కన్నులు దేలించేవేళ
యిందుముఖి నిన్నుఁగూడె నెన్నిక గాదా
చందపు శ్రీవేంకటేశ చలాన నుండె నిందాఁకా
కుందులేని వేడుకతో కొసర మఱచెను

(||pallavi||)
ĕṁta mŏgamāyabumaṁ demi dĕchchugŏṁṭivo
aṁtaḍi nī suddulĕlla anni yu maṟasĕnu

(||ĕṁta||)
ābasobamuna nīvu aṁduṁḍi vachchinaveḽa
ābĕ nīdo navvinadi arudu gādā
kobamudone vuṁḍĕ kori yiṁdām̐kā naide
yebuna nīmomu sūsi yiṁtalo maṟasĕnu

(||ĕṁta||)
viṁtasĕmaḍaladoḍa visariṁchugŏneveḽa
paṁtāna nābĕ segŏnĕ bhāgyamu gādā
siṁtiṁchĕ nīsem̐ta lĕlla sĕlise vini yiṁdām̐kā
maṁtanāna ninnāḍeḍimāḍalu maṟasĕnu

(||ĕṁta||)
kaṁduvam̐ garam̐gi nīvu kannulu deliṁcheveḽa
yiṁdumukhi ninnum̐gūḍĕ nĕnniga gādā
saṁdabu śhrīveṁkaḍeśha salāna nuṁḍĕ niṁdām̐kā
kuṁduleni veḍugado kŏsara maṟasĕnu