Emta meluvaamdo taanu yee sadigi

ఎంత మేలువాఁడో తాను యీ సతికి
Language

(॥పల్లవి॥)
ఎంత మేలువాఁడో తాను యీ సతికి
పంతగాఁ డింతేసి యేల పచ్చి సేసుకొనీనే

(॥॥)
సెలవి నవ్వినయింతి చేతికి విడెమియ్యదా
తలపోసి తానేల తమకించీనే
కొలువుకువచ్చినాపె కోరి మొక్కక మానీనా
చలివాసి తానేల సాదించీనే

(॥॥)
మాటలాడినట్టికాంత మరిగి పై కొనదా
చీటికి మాటికినేల చేయిచాఁచీనే
గాఁటమై పిలిచినాపె కాఁగిలించక మానీనా
కూటమికిఁ బెనఁగేల కొంగువట్టీనే

(॥॥)
ముచ్చట గలట్టిరామ మోవితేనె లొసఁగదా
విచ్చనవి డెంతేసి వేఁడుకొనీనే
తచ్చి శ్రీవేంకటేశుఁడు తానప్పటి నన్నుఁగూడె
యిచ్చకము లిపుడెంత యిట్టె నాకుఁ జేసీనే

(||pallavi||)
ĕṁta meluvām̐ḍo tānu yī sadigi
paṁtagām̐ ḍiṁtesi yela pachchi sesugŏnīne

(||||)
sĕlavi navvinayiṁti sedigi viḍĕmiyyadā
talabosi tānela tamagiṁchīne
kŏluvuguvachchinābĕ kori mŏkkaga mānīnā
salivāsi tānela sādiṁchīne

(||||)
māḍalāḍinaṭṭigāṁta marigi pai kŏnadā
sīḍigi māḍiginela seyisām̐sīne
gām̐ṭamai pilisinābĕ kām̐giliṁchaga mānīnā
kūḍamigim̐ bĕnam̐gela kŏṁguvaṭṭīne

(||||)
muchchaḍa galaṭṭirāma movidenĕ lŏsam̐gadā
vichchanavi ḍĕṁtesi vem̐ḍugŏnīne
tachchi śhrīveṁkaḍeśhum̐ḍu tānappaḍi nannum̐gūḍĕ
yichchagamu libuḍĕṁta yiṭṭĕ nāgum̐ jesīne