Emta meemdugatteno yimti neegu javvanamu

ఎంత మీఁదుకట్టెనో యింతి నీకు జవ్వనము
Language

(॥పల్లవి॥)
ఎంత మీఁదుకట్టెనో యింతి నీకు జవ్వనము
కాంతుఁడ వేమి సేసితో కానుక లంపెఁ జెలి

(॥ఎంత॥)
నిద్దిరించవలసినా నీకాఁగిటనే కాని
వొద్ద నిన్నుఁ బాసి వొంటినొల్లదు చెలి
కొద్దిగా మాఁటాడినాను కోరి నీతోనేకాని
ముద్దిరించి పరులతో మోనమే చెలి

(॥ఎంత॥)
ఆరగించవలసినా అటు నీపొత్తునఁగాని
వూరకే వేరెయైతే నొల్లదు చెలి
సారె విడెమిచ్చినాను సగమాకు నీ కియ్యక
చేరి వేరేతమ్ములము చేయదు చెలి

(॥ఎంత॥)
కొమ్మ పయ్యద గప్పినాఁగూడ నీతోఁగాని
వుమ్మడిఁ దనంతనై తే నొల్లదు చెలి
యిమ్ముల శ్రీవేంకటేశ యింతలోఁ గూడితిఁగాని
బమ్మర వెట్టినా నీకుఁ బాయదు చెలి

(||pallavi||)
ĕṁta mīm̐dugaṭṭĕno yiṁti nīgu javvanamu
kāṁtum̐ḍa vemi sesido kānuga laṁpĕm̐ jĕli

(||ĕṁta||)
niddiriṁchavalasinā nīgām̐giḍane kāni
vŏdda ninnum̐ bāsi vŏṁṭinŏlladu sĕli
kŏddigā mām̐ṭāḍinānu kori nīdonegāni
muddiriṁchi parulado moname sĕli

(||ĕṁta||)
āragiṁchavalasinā aḍu nībŏttunam̐gāni
vūrage verĕyaide nŏlladu sĕli
sārĕ viḍĕmichchinānu sagamāgu nī kiyyaga
seri veredammulamu seyadu sĕli

(||ĕṁta||)
kŏmma payyada gappinām̐gūḍa nīdom̐gāni
vummaḍim̐ danaṁtanai te nŏlladu sĕli
yimmula śhrīveṁkaḍeśha yiṁtalom̐ gūḍidim̐gāni
bammara vĕṭṭinā nīgum̐ bāyadu sĕli