Emta mannimchinaa neegu needujodayinade

ఎంత మన్నించినా నీకు నీడుజోడయినదె
Language

(॥పల్లవి॥)
ఎంత మన్నించినా నీకు నీడుజోడయినదె
దొంతి సోబనాలతోడి తొయ్యలి వో యాపె

(॥ఎంత॥)
కంకణదారాలు గట్టి కప్పురవిడెము లిచ్చీ
అంకెలఁ గాలుదొక్కిన ఆపెవో యీపె
సుంకులు చెరిగించుక సొరిదిఁ దోడనీళ్ళాడి
లంకెఁ బెండ్లిపీఁటెక్కిన లలనవో యీపె

(॥ఎంత॥)
తెరమఱఁగున నుండి దిగ్గన మొగముచూపీ
అరిమురి సేసవెట్టినట్టి ఆపెవో యీపె
సిరులఁ దాళిగట్టుక చేరి బువ్వా లారగించీ
సరి బాసికంబుల సకియవో యీపె

(॥ఎంత॥)
వూరల్లా నేఁగివచ్చి వొగిఁ గట్నా లిప్పించుక
ఆరతులెత్తించుకొన్న ఆపెవో యీపె
యారీతి నిలమేల్మంగ యీకె శ్రీవేంకటేశుఁడ
కూరిమి నీదేవులైన కొమ్మవో యీపె

(||pallavi||)
ĕṁta manniṁchinā nīgu nīḍujoḍayinadĕ
dŏṁti sobanāladoḍi tŏyyali vo yābĕ

(||ĕṁta||)
kaṁkaṇadārālu gaṭṭi kappuraviḍĕmu lichchī
aṁkĕlam̐ gāludŏkkina ābĕvo yībĕ
suṁkulu sĕrigiṁchuga sŏridim̐ doḍanīḽḽāḍi
laṁkĕm̐ bĕṁḍlibīm̐ṭĕkkina lalanavo yībĕ

(||ĕṁta||)
tĕramaṟam̐guna nuṁḍi diggana mŏgamusūbī
arimuri sesavĕṭṭinaṭṭi ābĕvo yībĕ
sirulam̐ dāḽigaṭṭuga seri buvvā lāragiṁchī
sari bāsigaṁbula sagiyavo yībĕ

(||ĕṁta||)
vūrallā nem̐givachchi vŏgim̐ gaṭnā lippiṁchuga
āradulĕttiṁchugŏnna ābĕvo yībĕ
yārīdi nilamelmaṁga yīgĕ śhrīveṁkaḍeśhum̐ḍa
kūrimi nīdevulaina kŏmmavo yībĕ