ఎంత మందెమేళము యేమనఁగ వచ్చు నాకు
(॥పల్లవి॥)
ఎంత మందెమేళము యేమనఁగ వచ్చు నాకు
చెంత నీవు నాకుఁ బని చెప్పవలెఁ గాక
(॥ఎంత॥)
నే నీకు బంటను నీవు నా కేలికవు
ఆనుకొని హద్ద నుండుమని యెట్టు నియమింతు
నానాఁటికిఁ బేరుకొని నంటున నే రీతిఁ బిలుతు
కానీలే నీ వేళ లెఱుఁగక యెట్టు దలఁతు
(॥ఎంత॥)
యేదైనా నాసపడి యెట్టు ని న్నడుగవచ్చు
సోదించి నీ భావ మెట్టు జూడవచ్చును
పాదుగా సంపదలకై పను లెట్టు గొనవచ్చు
యేదెఁసఁ జిత్త మెఱుఁగ కేగతి విన్నవింతు
(॥ఎంత॥)
యెప్పుడైనా నెట్టు వచ్చి యెదుట నిలువవచ్చు
చిప్పిల ని న్నంటి యెట్టు సేవ సేతును
అప్పఁడ శ్రీవేంకటేశ అలమేలుమంగపతి
కప్పి న న్నేలితివి కాదన నెట్టువచ్చు
(||pallavi||)
ĕṁta maṁdĕmeḽamu yemanam̐ga vachchu nāgu
sĕṁta nīvu nāgum̐ bani sĕppavalĕm̐ gāga
(||ĕṁta||)
ne nīgu baṁṭanu nīvu nā keligavu
ānugŏni hadda nuṁḍumani yĕṭṭu niyamiṁtu
nānām̐ṭigim̐ berugŏni naṁṭuna ne rīdim̐ biludu
kānīle nī veḽa lĕṟum̐gaga yĕṭṭu dalam̐tu
(||ĕṁta||)
yedainā nāsabaḍi yĕṭṭu ni nnaḍugavachchu
sodiṁchi nī bhāva mĕṭṭu jūḍavachchunu
pādugā saṁpadalagai panu lĕṭṭu gŏnavachchu
yedĕm̐sam̐ jitta mĕṟum̐ga kegadi vinnaviṁtu
(||ĕṁta||)
yĕppuḍainā nĕṭṭu vachchi yĕduḍa niluvavachchu
sippila ni nnaṁṭi yĕṭṭu seva sedunu
appam̐ḍa śhrīveṁkaḍeśha alamelumaṁgabadi
kappi na nnelidivi kādana nĕṭṭuvachchu