ఎంత మందెమేళమని యెంచకుమిఁక
(॥పల్లవి॥)
ఎంత మందెమేళమని యెంచకుమిఁక
మంతుకెక్క వలచాపె మరి యేమి సేసును
(॥ఎంత॥)
తలఁపులు లోలోనే తతిగొని రేఁచఁగాను
సొలసి చూడకెట్టుండు సుదతి నిన్ను
పెలుచుఁ దమకములు బెరసి గుబ్బతిలఁగా
యెలమిఁ బైకొనక యెట్టోర్వవచ్చును
(॥ఎంత॥)
ఆడుకోలు మాటలు యాసలు రేఁచఁగాను
వేడుకపడ కేలుండు వెలఁది నీకు
యీడుజోడైన వలపు లెచ్చరిక సేయఁగాను
తోడఁదోడఁ గోరికలు తొడర కేలుండును
(॥ఎంత॥)
తనివోని జవ్వనము తరపులు వెట్టఁగాను
పెనఁగికూడ కెట్లుండు ప్రియురాలు
యెనసితివి శ్రీవేంకటేశ యిన్నిటా నీకెను
మనసు నిలుప నెట్టు మరి వసమౌను
(||pallavi||)
ĕṁta maṁdĕmeḽamani yĕṁchagumim̐ka
maṁtugĕkka valasābĕ mari yemi sesunu
(||ĕṁta||)
talam̐pulu lolone tadigŏni rem̐sam̐gānu
sŏlasi sūḍagĕṭṭuṁḍu sudadi ninnu
pĕlusum̐ damagamulu bĕrasi gubbadilam̐gā
yĕlamim̐ baigŏnaga yĕṭṭorvavachchunu
(||ĕṁta||)
āḍugolu māḍalu yāsalu rem̐sam̐gānu
veḍugabaḍa keluṁḍu vĕlam̐di nīgu
yīḍujoḍaina valabu lĕchchariga seyam̐gānu
toḍam̐doḍam̐ gorigalu tŏḍara keluṁḍunu
(||ĕṁta||)
tanivoni javvanamu tarabulu vĕṭṭam̐gānu
pĕnam̐gigūḍa kĕṭluṁḍu priyurālu
yĕnasidivi śhrīveṁkaḍeśha yinniḍā nīgĕnu
manasu niluba nĕṭṭu mari vasamaunu