Emta maanumannam jimtalela maanune

ఎంత మానుమన్నఁ జింతలేల మానునే
Language

(॥పల్లవి॥)
ఎంత మానుమన్నఁ జింతలేల మానునే
పంతపుమనసు హరిపై నుంటేఁ గాక

(॥ఎంత॥)
తీరని బంధాలు నేఁడే తెగుమంటే నేల తెగు
భారపుమమతఁ బెడఁబాసినఁగాక
వూరటగా మమత నేనొల్లనంటే నేల మాను
వోరువుతో లంపటము లొల్లకుంటేఁగాక

(॥ఎంత॥)
వేఁకపుఁగోపము నేఁడే విడుమంటే నేల విడు
తోఁకచిచ్చయినయాసఁ దుంచినఁగాక
ఆఁకట నానేల మాను అన్నిటాను యిందరికి
మాఁకుపడి తత్తరము మఱచుంటేఁగాక

(॥ఎంత॥)
పెట్టనిది దైవ మిట్టే పెట్టుమంటే నేల పెట్టు
యిట్టే వేంకటపతి యిచ్చినఁగాక
యిట్టునట్టు నీతఁడు దా నిందరికి నేల యిచ్చు
వొట్టినవిరక్తి నేమి నొల్లకుంటేఁగాక

(||pallavi||)
ĕṁta mānumannam̐ jiṁtalela mānune
paṁtabumanasu haribai nuṁṭem̐ gāga

(||ĕṁta||)
tīrani baṁdhālu nem̐ḍe tĕgumaṁṭe nela tĕgu
bhārabumamadam̐ bĕḍam̐bāsinam̐gāga
vūraḍagā mamada nenŏllanaṁṭe nela mānu
voruvudo laṁpaḍamu lŏllaguṁṭem̐gāga

(||ĕṁta||)
vem̐kabum̐gobamu nem̐ḍe viḍumaṁṭe nela viḍu
tom̐kasichchayinayāsam̐ duṁchinam̐gāga
ām̐kaḍa nānela mānu anniḍānu yiṁdarigi
mām̐kubaḍi tattaramu maṟasuṁṭem̐gāga

(||ĕṁta||)
pĕṭṭanidi daiva miṭṭe pĕṭṭumaṁṭe nela pĕṭṭu
yiṭṭe veṁkaḍabadi yichchinam̐gāga
yiṭṭunaṭṭu nīdam̐ḍu dā niṁdarigi nela yichchu
vŏṭṭinavirakti nemi nŏllaguṁṭem̐gāga