Emta maanaabadivi ninnemi seppedi

ఎంత మానాపతివి నిన్నేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత మానాపతివి నిన్నేమి చెప్పేది
మంతనములాడేవు మండెము నారసింహా

(॥ఎంత॥)
చేరి విడెమిమ్మంటే సిగ్గులువడేవు నీవు
వోరి నీసతెవ్వతైనా వున్నదా యీడ
గోర నిన్ను గీరఁగాను గొబ్బున వేఁడుకొనేవు
ఆరీతు లెవ్వతైనా నిన్నాడుకొనీనా

(॥ఎంత॥)
మోముచూచి నవ్వితేను మొక్కుచును లోఁగేవు
నీమగువ లీడ వచ్చి నిన్నుఁ జూచేరా
కామించి మోవికెంపులు కలిగించితే మూసేవు
చూ; మరల నెవ్వతైనా సొలసి తిట్టెనా

(॥ఎంత॥)
సారెకు మాటలాడితే సన్నలు సేసేవు నీవు
దూరి నీమోహపుచెలి దొమ్మి సేసీనా
యీరీతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కేరడాన నెవ్వతైనా కేలుచాఁచీనా

(||pallavi||)
ĕṁta mānābadivi ninnemi sĕppedi
maṁtanamulāḍevu maṁḍĕmu nārasiṁhā

(||ĕṁta||)
seri viḍĕmimmaṁṭe sigguluvaḍevu nīvu
vori nīsadĕvvadainā vunnadā yīḍa
gora ninnu gīram̐gānu gŏbbuna vem̐ḍugŏnevu
ārīdu lĕvvadainā ninnāḍugŏnīnā

(||ĕṁta||)
momusūsi navvidenu mŏkkusunu lom̐gevu
nīmaguva līḍa vachchi ninnum̐ jūserā
kāmiṁchi movigĕṁpulu kaligiṁchide mūsevu
sū; marala nĕvvadainā sŏlasi tiṭṭĕnā

(||ĕṁta||)
sārĕgu māḍalāḍide sannalu sesevu nīvu
dūri nīmohabusĕli dŏmmi sesīnā
yīrīdi śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
keraḍāna nĕvvadainā kelusām̐sīnā