ఎంత లేదు వట్టి సట యీపె నీతోను
(॥పల్లవి॥)
ఎంత లేదు వట్టి సట యీపె నీతోను
బంతిని నీవే సారెఁ బాలార్చేవు
(॥ఎంత॥)
చేకొని ఇందరిలోన సిగ్గులు వడీఁ జెలి
యేకతాన నుండరాదా ఇయ్యకొనీని
దీకొని వొడఁబరచితే నానలెల్లఁ బెట్టీ
దాకొని కాఁగిలించుమా తానే లోనయ్యీని
(॥ఎంత॥)
తప్పక చూడఁగ నీతోఁ దలవంచుకొనీఁ జెలి
కొప్పు వట్టి తియ్యరాదా కొంకుదేరీని
ముప్పిరిఁ జెనకితేను మొక్కలములెల్ల నాడీ
కప్పుమా పచ్చడ మిట్టె కరఁగీ నిక్కువలు
(॥ఎంత॥)
నానఁబెట్టితే వలపు నవ్వులు నవ్వీఁ జెలి
మానము లంటఁగరాదా మనసిచ్చీని
తానె శ్రీ వేంకటేశ దగ్గరి నిన్నుఁ గలసె
కానిమ్మని వినరాదా కతలు చెప్పీని
(||pallavi||)
ĕṁta ledu vaṭṭi saḍa yībĕ nīdonu
baṁtini nīve sārĕm̐ bālārsevu
(||ĕṁta||)
segŏni iṁdarilona siggulu vaḍīm̐ jĕli
yegadāna nuṁḍarādā iyyagŏnīni
dīgŏni vŏḍam̐baraside nānalĕllam̐ bĕṭṭī
dāgŏni kām̐giliṁchumā tāne lonayyīni
(||ĕṁta||)
tappaga sūḍam̐ga nīdom̐ dalavaṁchugŏnīm̐ jĕli
kŏppu vaṭṭi tiyyarādā kŏṁkuderīni
muppirim̐ jĕnagidenu mŏkkalamulĕlla nāḍī
kappumā pachchaḍa miṭṭĕ karam̐gī nikkuvalu
(||ĕṁta||)
nānam̐bĕṭṭide valabu navvulu navvīm̐ jĕli
mānamu laṁṭam̐garādā manasichchīni
tānĕ śhrī veṁkaḍeśha daggari ninnum̐ galasĕ
kānimmani vinarādā kadalu sĕppīni