Emta ledu tana suddu lemi seppedi

ఎంత లేదు తన సుద్దు లేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత లేదు తన సుద్దు లేమి చెప్పేది
చెంత నున్న చెలులకుఁ జేయి చాఁచకుండునా

(॥ఎంత॥)
మగువ కెవ్వతెకో మా టిచ్చి వచ్చినవాఁడై
నగ నెఱచీఁ గాక నాతోఁ దాను
వొగరు మాటల కెల్లా వోరిచేవాఁడా తొల్లి
నిగిడి సాదుఁదనాలు నెరపీ నే డీడనే

(॥ఎంత॥)
వనిత కెవ్వతెకో వలచి వచ్చినవాఁడై
మనసురాదు గాక మాటలాడను
చెనకిన యాఁటదాని చేకొను కుండఁగలఁడా
పనిమాలిన బిగువు పచరించీ నీడనే

(॥ఎంత॥)
పడఁతి యెవ్వతెతోనో పంత మాడినవాఁడై
తడవ వచ్చీఁ గాక తనంత నన్ను
అడరి శ్రీవేంకటేశుఁ డంగవించి నన్నుఁ గూడె
యెడసి నాతో నిన్నాళ్ళటువలె నుండునా

(||pallavi||)
ĕṁta ledu tana suddu lemi sĕppedi
sĕṁta nunna sĕlulagum̐ jeyi sām̐saguṁḍunā

(||ĕṁta||)
maguva kĕvvadĕgo mā ṭichchi vachchinavām̐ḍai
naga nĕṟasīm̐ gāga nādom̐ dānu
vŏgaru māḍala kĕllā vorisevām̐ḍā tŏlli
nigiḍi sādum̐danālu nĕrabī ne ḍīḍane

(||ĕṁta||)
vanida kĕvvadĕgo valasi vachchinavām̐ḍai
manasurādu gāga māḍalāḍanu
sĕnagina yām̐ṭadāni segŏnu kuṁḍam̐galam̐ḍā
panimālina biguvu pasariṁchī nīḍane

(||ĕṁta||)
paḍam̐ti yĕvvadĕdono paṁta māḍinavām̐ḍai
taḍava vachchīm̐ gāga tanaṁta nannu
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍaṁgaviṁchi nannum̐ gūḍĕ
yĕḍasi nādo ninnāḽḽaḍuvalĕ nuṁḍunā