ఎంత లేదు తలపోఁత యెంచి చూడ నెవ్వరికి
(॥పల్లవి॥)
ఎంత లేదు తలపోఁత యెంచి చూడ నెవ్వరికి
యింతటే నీ సతి ననే దిది చాలదా
(॥ఎంత॥)
చూపుల దవ్వుల నిన్నుఁ జూచితేనే నవ్వితివి
యీపాటికీపాటి యింత చాలదా
వోపి కొండశిలవలె నో యంటే నో యంటివి
ఆ పలుకు కీ పలుకు అంత చాలదా
(॥ఎంత॥)
సోవలఁ దాపపు నన్నుఁ జూడఁ జెలి నంపితివి
యీవాడ కావాడ యింత చాలదా
నీవు వీది నుండఁగాను నిక్కి నిన్నుఁ జూచితేనే
ఆవలిమోఁ మీఁవ లైతి వంత చాలదా
(॥ఎంత॥)
ప్రేమము నీవే యెఱిఁగి పిలిచి నన్నుఁ గూడితి
నీ మేలు కా మేలు యింత చాలదా
నేమపు శ్రీవేంకటేశ నీ రతియు నా రతియు
ఆమనిపై నామ నాయ నంత చాలదా
(||pallavi||)
ĕṁta ledu talabom̐ta yĕṁchi sūḍa nĕvvarigi
yiṁtaḍe nī sadi nane didi sāladā
(||ĕṁta||)
sūbula davvula ninnum̐ jūsidene navvidivi
yībāḍigībāḍi yiṁta sāladā
vobi kŏṁḍaśhilavalĕ no yaṁṭe no yaṁṭivi
ā palugu kī palugu aṁta sāladā
(||ĕṁta||)
sovalam̐ dābabu nannum̐ jūḍam̐ jĕli naṁpidivi
yīvāḍa kāvāḍa yiṁta sāladā
nīvu vīdi nuṁḍam̐gānu nikki ninnum̐ jūsidene
āvalimom̐ mīm̐va laidi vaṁta sāladā
(||ĕṁta||)
premamu nīve yĕṟim̐gi pilisi nannum̐ gūḍidi
nī melu kā melu yiṁta sāladā
nemabu śhrīveṁkaḍeśha nī radiyu nā radiyu
āmanibai nāma nāya naṁta sāladā