Emta ledu nee vesaalemannaa ne nammalenu

ఎంత లేదు నీ వేసాలేమన్నా నే నమ్మలేను
Language

(॥పల్లవి॥)
ఎంత లేదు నీ వేసాలేమన్నా నే నమ్మలేను
అంతగలవాఁడైతే నాతఁడే రాఁడా

(॥ఎంత॥)
యీతల నొక్కొక్కమాటే యెందో నేరుచుకవచ్చి
ఆతఁడాడెనంటా నాతోనాడేవు
పై తరవు వేవేలు పడఁతులు గలవాఁడు
మాతోడి గొడవేల మమ్ముఁ దలఁచీనా

(॥ఎంత॥)
యేడ పనిగలిగో మీరెక్కడో పోతా వచ్చి
యీడకాతఁడంపెనంటా యిచ్చలాడేరు
వాడికెనింతుల నీడ వచ్చేవాఁడతనికి
యీడ నేమేమి బాఁతి యెంత లేదీసుద్దులు

(॥ఎంత॥)
పొరుగుననుండి మీకు పొద్దువోక యిటు వచ్చి
మురిపేన వానిమారు మొక్కేరు నాకు
అరుదై శ్రీవేంకటేశుఁడాతఁడె విచ్చేసి కూడె
ధరలోనిన్నాళ్ళదాఁకా తడవెనా మమ్మును

(||pallavi||)
ĕṁta ledu nī vesālemannā ne nammalenu
aṁtagalavām̐ḍaide nādam̐ḍe rām̐ḍā

(||ĕṁta||)
yīdala nŏkkŏkkamāḍe yĕṁdo nerusugavachchi
ādam̐ḍāḍĕnaṁṭā nādonāḍevu
pai taravu vevelu paḍam̐tulu galavām̐ḍu
mādoḍi gŏḍavela mammum̐ dalam̐sīnā

(||ĕṁta||)
yeḍa panigaligo mīrĕkkaḍo podā vachchi
yīḍagādam̐ḍaṁpĕnaṁṭā yichchalāḍeru
vāḍigĕniṁtula nīḍa vachchevām̐ḍadanigi
yīḍa nememi bām̐ti yĕṁta ledīsuddulu

(||ĕṁta||)
pŏrugunanuṁḍi mīgu pŏdduvoga yiḍu vachchi
muribena vānimāru mŏkkeru nāgu
arudai śhrīveṁkaḍeśhum̐ḍādam̐ḍĕ vichchesi kūḍĕ
dharaloninnāḽḽadām̐kā taḍavĕnā mammunu