Emta ledu nee pagadu yemi seppede

ఎంత లేదు నీ పగటు యేమి చెప్పేదే
Language

(॥పల్లవి॥)
ఎంత లేదు నీ పగటు యేమి చెప్పేదే
రంతుగా మాఁటాడితేనే రతికి నెక్కితివా

(॥ఎంత॥)
కంకణాలచేత నీవు కైదండ ఇచ్చినంతలో
అంకెల నీ వీతనికి నాలవైతివా
కుంకుమ గుబ్బలు చూపి కొలువులు సేసితేనే
సంకె లేక నీవిప్పడు చనవరివైతివా

(॥ఎంత॥)
సింగారించుకొని వచ్చి సెలవుల నవ్వితేనే
అంగజకేలికి నెక్కుడైనదానవా
సంగడిఁ గూచుండి నీవు సరసము లాడితేనే
సంగతెరిఁగిన యట్టి జాణవైతివా

(॥ఎంత॥)
చెక్కుల జవ్వాది గార సేసలు పైఁజల్లితేనే
మిక్కిలి దొరతనాన మేటివైతివా
యిక్కడ శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
నిక్కి నిక్కి చూచితేనే నేరుపరిపైతివా

(||pallavi||)
ĕṁta ledu nī pagaḍu yemi sĕppede
raṁtugā mām̐ṭāḍidene radigi nĕkkidivā

(||ĕṁta||)
kaṁkaṇālaseda nīvu kaidaṁḍa ichchinaṁtalo
aṁkĕla nī vīdanigi nālavaidivā
kuṁkuma gubbalu sūbi kŏluvulu sesidene
saṁkĕ lega nīvippaḍu sanavarivaidivā

(||ĕṁta||)
siṁgāriṁchugŏni vachchi sĕlavula navvidene
aṁgajageligi nĕkkuḍainadānavā
saṁgaḍim̐ gūsuṁḍi nīvu sarasamu lāḍidene
saṁgadĕrim̐gina yaṭṭi jāṇavaidivā

(||ĕṁta||)
sĕkkula javvādi gāra sesalu paim̐jallidene
mikkili dŏradanāna meḍivaidivā
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannu nelĕ
nikki nikki sūsidene nerubaribaidivā