ఎంత లేదు లోకము యెచ్చేది కుందేది
(॥పల్లవి॥)
ఎంత లేదు లోకము యెచ్చేది కుందేది
పంతపు శ్రీహరిభక్తి పట్టవలెఁ గాక
(॥ఎంత॥)
తనువులు మోచేది ధనములు దాఁచేది
ఘనజీవులకు నెల్లఁ గలిగినది
మనసులు రోసేది మమతలఁ బాసేది
వనజాక్షుఁ గొలిచేది వలె నింతె కాక
(॥ఎంత॥)
కాఁపురాలు సేసేది కపటాల లాసేది
తాపపు జీవుల కెల్లాఁ దగిలినదె
కోపములఁ దుంచేది కోరికలఁ దెంచేది
శ్రీపతి కరుణలోనఁ జిక్కవలెఁగాక
(॥ఎంత॥)
ఆఁకటికి బడలేది అన్నములు గొనియేది
తేఁకువ జీవుల కెల్ల ద్రిష్టమైనదె
యేఁకటతో శ్రీవేంకటేశ్వరు శరణని
కాఁకదేర సుఖియించఁగా వలెఁగాక
(||pallavi||)
ĕṁta ledu logamu yĕchchedi kuṁdedi
paṁtabu śhrīharibhakti paṭṭavalĕm̐ gāga
(||ĕṁta||)
tanuvulu mosedi dhanamulu dām̐sedi
ghanajīvulagu nĕllam̐ galiginadi
manasulu rosedi mamadalam̐ bāsedi
vanajākṣhum̐ gŏlisedi valĕ niṁtĕ kāga
(||ĕṁta||)
kām̐purālu sesedi kabaḍāla lāsedi
tābabu jīvula kĕllām̐ dagilinadĕ
kobamulam̐ duṁchedi korigalam̐ dĕṁchedi
śhrībadi karuṇalonam̐ jikkavalĕm̐gāga
(||ĕṁta||)
ām̐kaḍigi baḍaledi annamulu gŏniyedi
tem̐kuva jīvula kĕlla driṣhṭamainadĕ
yem̐kaḍado śhrīveṁkaḍeśhvaru śharaṇani
kām̐kadera sukhiyiṁcham̐gā valĕm̐gāga