Emta kettugomtivi nee veraa vori

ఎంత కెత్తుకొంటివి నీ వేరా వోరి
Language

(॥పల్లవి॥)
ఎంత కెత్తుకొంటివి నీ వేరా వోరి
చెంతల నవ్వు నవ్వేవు చెల్లురా వోరి

(॥ఎంతకెత్తు॥)
చెఱఁగు మాసినదాని చెక్కు ముట్టి వేఁడుకొని
యెఱిఁగి నన్నంట వచ్చే వేరా వోరి
యఱియు సురతపుఁజెమటలు జొబ్బిలఁగాను
వుఱక నాపైఁ బూసేవు వుద్దండాలా వోరి

(॥ఎంత కెత్తు॥)
గుట్టున నాకెపొత్తున కోరి యారగించుకొంటా
అట్టె నాకుఁ గడెఁ దిచ్చే వదేరా వోరి
వొట్టుక ఆపెయు నీవు వుండనపరపుమీఁద
యెట్టు గూచుండఁ బిలిచే వేరా నన్ను వోరీ

(॥ఎంత కెత్తు॥)
అచ్చు వాసుకొన్నదాని నట్టె నీవు గూడి వచ్చి
యిచ్చల నన్నుఁ గూడితి వేరా వోరి
పచ్చిగా శ్రీవెంకటేశ భ్రమసితి నీరతుల
మెచ్చితి ని న్నిన్నిటాను మేలు మేలు వోరి

(||pallavi||)
ĕṁta kĕttugŏṁṭivi nī verā vori
sĕṁtala navvu navvevu sĕllurā vori

(||ĕṁtagĕttu||)
sĕṟam̐gu māsinadāni sĕkku muṭṭi vem̐ḍugŏni
yĕṟim̐gi nannaṁṭa vachche verā vori
yaṟiyu suradabum̐jĕmaḍalu jŏbbilam̐gānu
vuṟaga nābaim̐ būsevu vuddaṁḍālā vori

(||ĕṁta kĕttu||)
guṭṭuna nāgĕbŏttuna kori yāragiṁchugŏṁṭā
aṭṭĕ nāgum̐ gaḍĕm̐ dichche vaderā vori
vŏṭṭuga ābĕyu nīvu vuṁḍanabarabumīm̐da
yĕṭṭu gūsuṁḍam̐ bilise verā nannu vorī

(||ĕṁta kĕttu||)
achchu vāsugŏnnadāni naṭṭĕ nīvu gūḍi vachchi
yichchala nannum̐ gūḍidi verā vori
pachchigā śhrīvĕṁkaḍeśha bhramasidi nīradula
mĕchchidi ni nninniḍānu melu melu vori