Emta kemta sesevu yeraa neevu

ఎంత కెంత సేసేవు యేరా నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత కెంత సేసేవు యేరా నీవు
పంతగాఁడ మేలు మేలు పైకొని వచ్చేవు

(॥ఎంత॥)
వొడివట్టి తీసేవు వోప నంటేఁ దిట్టేవు
పడఁతులతో నేర బలువా నీకు
అడరి నా వెంట వచ్చే వప్పులవానివలె
విడువ వింత పనికి వెరతురా నీకు

(॥ఎంత॥)
ఆదిగొని పై నొరగేవు అట్టట్టే పోతేఁ బట్టేవు
సాదులతోనె యింత చలమా నీకు
గోదిలి సాదించేవు గొనుకొన్నవానివలె
యీ దెస నీ గాతికిన యింత కోపఁ గలవా

(॥ఎంత॥)
కామించి నగ వచ్చేవు కాఁగిట బిగించేవు
యేమి నననివారితో యేతులా నీకు
దోమటి దొడికితిని దొడ్డచుట్టమువలెనె
నేమపు శ్రీవెంకటేశ నీవె నీ నయితిరా

(||pallavi||)
ĕṁta kĕṁta sesevu yerā nīvu
paṁtagām̐ḍa melu melu paigŏni vachchevu

(||ĕṁta||)
vŏḍivaṭṭi tīsevu voba naṁṭem̐ diṭṭevu
paḍam̐tulado nera baluvā nīgu
aḍari nā vĕṁṭa vachche vappulavānivalĕ
viḍuva viṁta panigi vĕradurā nīgu

(||ĕṁta||)
ādigŏni pai nŏragevu aṭṭaṭṭe podem̐ baṭṭevu
sāduladonĕ yiṁta salamā nīgu
godili sādiṁchevu gŏnugŏnnavānivalĕ
yī dĕsa nī gādigina yiṁta kobam̐ galavā

(||ĕṁta||)
kāmiṁchi naga vachchevu kām̐giḍa bigiṁchevu
yemi nananivārido yedulā nīgu
domaḍi dŏḍigidini dŏḍḍasuṭṭamuvalĕnĕ
nemabu śhrīvĕṁkaḍeśha nīvĕ nī nayidirā