Emta kemta sesevu ye

ఎంత కెంత సేసేవు యే
Language

(॥పల్లవి॥)
ఎంత కెంత సేసేవు యే-
చింత దీర నాతనిపైఁ జెయి వేయవమ్మా

(॥ఎంత॥)
చేతిమీఁది చెక్కి దేల చెలవుఁడు వేఁడుకొనీ
అతనిమాటలు కాని మ్మన వమ్మా
రాతిటనుంటియు జాగరములె సేయఁగఁ బట్టె
యీ తరుణులఁ జూ చైన యియ్యకొన వమ్మా

(॥ఎంత॥)
కొప్పు ముడవ వి దేల కోపము దీర్చె నాతఁడు
చెప్పిన ట్టల్లా నిఁకఁ జేయ వమ్మా
ఱెప్పలు రిచ్చవడె మీ ఱేసు లెల్లాఁ జూచి చూచి
చిప్పిల నీ నవ్వులనె సేసవెట్ట మమ్మా

(॥ఎంత॥)
వట్టి మోనా లిఁక నేల వాఁడె సరసము లాడీ
పట్టినచలము మాని పలుక వమ్మా
యిట్టె శ్రీవెంకటేశుఁ డితఁడు గూడె నిన్ను
నెట్టుకొని రతుల నిన్నిటా మెచ్చ వమ్మా

(||pallavi||)
ĕṁta kĕṁta sesevu ye-
siṁta dīra nādanibaim̐ jĕyi veyavammā

(||ĕṁta||)
sedimīm̐di sĕkki dela sĕlavum̐ḍu vem̐ḍugŏnī
adanimāḍalu kāni mmana vammā
rādiḍanuṁṭiyu jāgaramulĕ seyam̐gam̐ baṭṭĕ
yī taruṇulam̐ jū saina yiyyagŏna vammā

(||ĕṁta||)
kŏppu muḍava vi dela kobamu dīrsĕ nādam̐ḍu
sĕppina ṭṭallā nim̐kam̐ jeya vammā
ṟĕppalu richchavaḍĕ mī ṟesu lĕllām̐ jūsi sūsi
sippila nī navvulanĕ sesavĕṭṭa mammā

(||ĕṁta||)
vaṭṭi monā lim̐ka nela vām̐ḍĕ sarasamu lāḍī
paṭṭinasalamu māni paluga vammā
yiṭṭĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍidam̐ḍu gūḍĕ ninnu
nĕṭṭugŏni radula ninniḍā mĕchcha vammā