Emta kemta nee suddu lemanavachchu

ఎంత కెంత నీ సుద్దు లేమనవచ్చు
Language

(॥పల్లవి॥)
ఎంత కెంత నీ సుద్దు లేమనవచ్చు
అంతరంగమైన చెంత(చేఁత?) లంగడిఁ బెట్టుదురా

(॥ఎంత॥)
చెలియ సెలవులను చిరునవ్వు నవ్వఁగానె
యెలమి నీవేకాంతము లేమాడేవు
మొలక సిగ్గులతోడ మోము వంచుకొనఁగానె
అలరి తొంగిచూతురా ఆపె మోము నీవు

(॥ఎంత॥)
వనిత నీకొలువులు వాడికతోఁ జేయఁగానె
పని చెప్పేవు పానుపు పరచుమని
చననవున గుట్టుతోడ సన్న నీకుఁ జేయఁగానే
పెనఁగి పచ్చిసేతురా ప్రియురాలి నీవు

(॥వంత॥)
అలమేలుమంగ నీయక్కుమీఁద నుండఁగానె
బలిమిఁ గాఁగిట నెంత బత్తి చూపేవు
అలరి శ్రీవేంకటేశ ఆపె నిన్ను మెచ్చఁగానె
పలుకులఁ జెప్పుదురా పంతమెల్లా నీవు

(||pallavi||)
ĕṁta kĕṁta nī suddu lemanavachchu
aṁtaraṁgamaina sĕṁta(sem̐ta?) laṁgaḍim̐ bĕṭṭudurā

(||ĕṁta||)
sĕliya sĕlavulanu sirunavvu navvam̐gānĕ
yĕlami nīvegāṁtamu lemāḍevu
mŏlaga sigguladoḍa momu vaṁchugŏnam̐gānĕ
alari tŏṁgisūdurā ābĕ momu nīvu

(||ĕṁta||)
vanida nīgŏluvulu vāḍigadom̐ jeyam̐gānĕ
pani sĕppevu pānubu parasumani
sananavuna guṭṭudoḍa sanna nīgum̐ jeyam̐gāne
pĕnam̐gi pachchisedurā priyurāli nīvu

(||vaṁta||)
alamelumaṁga nīyakkumīm̐da nuṁḍam̐gānĕ
balimim̐ gām̐giḍa nĕṁta batti sūbevu
alari śhrīveṁkaḍeśha ābĕ ninnu mĕchcham̐gānĕ
palugulam̐ jĕppudurā paṁtamĕllā nīvu