Emta kemta nee pagadu yemi seppedi

ఎంత కెంత నీ పగటు యేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత కెంత నీ పగటు యేమి చెప్పేది
మంతుకెక్కి నా వలెనే మన్ననదానవా

(॥ఎంత॥)
సారెకు నా మగనితో బాణతనాలాడేవు
కూరిములు చల్లుకొంటాఁ గొసరేవు
చేరువనే కూచుండి సేవలు సేయవచ్చేవు
పేరుకొని కావలె పెండ్లికూఁతురవా

(॥ఎంత॥)
తప్పక చూచి యీతనిఁ దమి రేఁచవచ్చేవు
యెప్పుడూ నెదుటనుండి యేఁకారేవు
దప్పిదేర మోవి చూపి తలఁపించేవు పొందులు
చెప్పవే నావలె నీవూ సేసలు వెట్టితివా

(॥ఎంత॥)
గుట్టున శ్రీవేంకటేశుఁ గోరి చాగిలి మొక్కేవు
వొట్టుక చనుమొనల నూఁది పట్టేవు
యిట్టె న న్నేలినాఁడు యీతఁడు నీ కేమవునే
జట్టిగా నావలె నీవూఁ బట్టము దేవులవా

(||pallavi||)
ĕṁta kĕṁta nī pagaḍu yemi sĕppedi
maṁtugĕkki nā valĕne mannanadānavā

(||ĕṁta||)
sārĕgu nā maganido bāṇadanālāḍevu
kūrimulu sallugŏṁṭām̐ gŏsarevu
seruvane kūsuṁḍi sevalu seyavachchevu
perugŏni kāvalĕ pĕṁḍligūm̐turavā

(||ĕṁta||)
tappaga sūsi yīdanim̐ dami rem̐savachchevu
yĕppuḍū nĕduḍanuṁḍi yem̐kārevu
dappidera movi sūbi talam̐piṁchevu pŏṁdulu
sĕppave nāvalĕ nīvū sesalu vĕṭṭidivā

(||ĕṁta||)
guṭṭuna śhrīveṁkaḍeśhum̐ gori sāgili mŏkkevu
vŏṭṭuga sanumŏnala nūm̐di paṭṭevu
yiṭṭĕ na nnelinām̐ḍu yīdam̐ḍu nī kemavune
jaṭṭigā nāvalĕ nīvūm̐ baṭṭamu devulavā