ఎంత కెంత మీ రేల యిచ్చకములాడేరే
(॥పల్లవి॥)
ఎంత కెంత మీ రేల యిచ్చకములాడేరే
దొంతిఁ బెట్టేరు వలపు దోసము గాదా
(॥॥)
ఇంగితాన నిష్టూరా లెన్నఁడూ నాడఁడాతఁడు
అంగనలాల నామాట లటువంటివా
సంగడి మమ్మిద్దరిని సరిసేసేరేలే మీరు
పంగించకాతనికి నేఁ బంత మిచ్చేనే
(॥॥)
కొప్పువట్టి తీసినాను కోపగించఁడాతఁడు
యెప్పుడు మాగుణములు యిటువంటివా
కప్పి మమ్మిద్దరి నేల కాఁగిలించఁ బెట్టేరే
చిప్పిల దిగువనుండి చేత మొక్కేనే
(॥॥)
యెంతేసి కొసరినాను యేమి వేసారఁడాతఁడు
వంతుల మావోరు పటువంటిదయ్యీనా
యింతలో శ్రీవేంకటేశుఁ డెనసె నన్నిపు డిట్టే
చెంతనుండి మెచ్చి మెచ్చి సేస వెట్టేనే
(||pallavi||)
ĕṁta kĕṁta mī rela yichchagamulāḍere
dŏṁtim̐ bĕṭṭeru valabu dosamu gādā
(||||)
iṁgidāna niṣhṭūrā lĕnnam̐ḍū nāḍam̐ḍādam̐ḍu
aṁganalāla nāmāḍa laḍuvaṁṭivā
saṁgaḍi mammiddarini sariseserele mīru
paṁgiṁchagādanigi nem̐ baṁta michchene
(||||)
kŏppuvaṭṭi tīsinānu kobagiṁcham̐ḍādam̐ḍu
yĕppuḍu māguṇamulu yiḍuvaṁṭivā
kappi mammiddari nela kām̐giliṁcham̐ bĕṭṭere
sippila diguvanuṁḍi seda mŏkkene
(||||)
yĕṁtesi kŏsarinānu yemi vesāram̐ḍādam̐ḍu
vaṁtula māvoru paḍuvaṁṭidayyīnā
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ nannibu ḍiṭṭe
sĕṁtanuṁḍi mĕchchi mĕchchi sesa vĕṭṭene