Emta kemta mannimchevu yemayya neevu

ఎంత కెంత మన్నించేవు యేమయ్య నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత కెంత మన్నించేవు యేమయ్య నీవు
అంతలోనే మెచ్చేవు నీయంతదాననా

(॥ఎంత॥)
చెక్కులు నే నొక్కఁగాను చేతుల మొక్కవచ్చేవు
వొక్కటఁ బతికిపతి వుపకారమా
మొక్కలపుదాన నేను ముందెంచేవాఁడవు నీవు
చక్కఁగ చేయి వట్టేవు సరిదాననా

(॥ఎంత॥)
కందువ నే నవ్వితేను కడుసరసమాడేవు
వొందిలి నందుకునిందు కుపకారమా
మందెమేళపుదానను మంచినేర్పరివి నీవు
పందేలువేసేవు నీపాటిదాననా

(॥ఎంత॥)
చేరి కాగిలించుకొంటే సిగ్గులు చేతఁబట్టేవు
వూరట మారుకుమారు వుపకారమా
ఆరీతి శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
మేరలు రేవు నిన్ను మించేదాననా

(||pallavi||)
ĕṁta kĕṁta manniṁchevu yemayya nīvu
aṁtalone mĕchchevu nīyaṁtadānanā

(||ĕṁta||)
sĕkkulu ne nŏkkam̐gānu sedula mŏkkavachchevu
vŏkkaḍam̐ badigibadi vubagāramā
mŏkkalabudāna nenu muṁdĕṁchevām̐ḍavu nīvu
sakkam̐ga seyi vaṭṭevu saridānanā

(||ĕṁta||)
kaṁduva ne navvidenu kaḍusarasamāḍevu
vŏṁdili naṁduguniṁdu kubagāramā
maṁdĕmeḽabudānanu maṁchinerbarivi nīvu
paṁdeluvesevu nībāḍidānanā

(||ĕṁta||)
seri kāgiliṁchugŏṁṭe siggulu sedam̐baṭṭevu
vūraḍa mārugumāru vubagāramā
ārīdi śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
meralu revu ninnu miṁchedānanā