Emta kathinamo hrdaya midi

ఎంత కఠినమో హృదయ మిది
Language

(॥పల్లవి॥)
ఎంత కఠినమో హృదయ మిది
చెంత ఱాతఁ జేసిరి గాఁబోలు

(॥ఎంత॥)
అమరఁ బురాణములందు నరకముల-
క్రమములు చదివియుఁ గలంగవు
యమకింకరఘోరాకృతు లటు విని
భ్రమసి యించుకా భయపడ నేను

(॥ఎంత॥)
మనుజుల దారుణమహితకర్మముల-
అనుభవములు గని యలయను
వొనర మహోగ్ర యహోరాత్రంబులు
చనుచుండంగా జడియను నేను

(॥ఎంత॥)
కలుషరౌద్రదుఃఖముల కించుకా
కలఁగను చీరికిఁ గైకొనను
యెలమిని శ్రీవేంకటేశుఁడ నాపాలఁ
గలిగి కాచితివి గాసిల నేను

(||pallavi||)
ĕṁta kaṭhinamo hṛdaya midi
sĕṁta ṟādam̐ jesiri gām̐bolu

(||ĕṁta||)
amaram̐ burāṇamulaṁdu naragamula-
kramamulu sadiviyum̐ galaṁgavu
yamagiṁkaraghorākṛtu laḍu vini
bhramasi yiṁchugā bhayabaḍa nenu

(||ĕṁta||)
manujula dāruṇamahidagarmamula-
anubhavamulu gani yalayanu
vŏnara mahogra yahorātraṁbulu
sanusuṁḍaṁgā jaḍiyanu nenu

(||ĕṁta||)
kaluṣharaudraduḥkhamula kiṁchugā
kalam̐ganu sīrigim̐ gaigŏnanu
yĕlamini śhrīveṁkaḍeśhum̐ḍa nābālam̐
galigi kāsidivi gāsila nenu