Emta kaadareemda vemani vinnavimcheri

ఎంత కాతరీఁడ వేమని విన్నవించేరి
Language

(॥పల్లవి॥)
ఎంత కాతరీఁడ వేమని విన్నవించేరి
వంతుకుఁ జిరునవ్వుతో వడిఁదిట్టీఁ జెలియ

(॥ఎంత॥)
జలకమాడేచోటికి సారెఁ జొచ్చివచ్చేవు
వెలఁదిఁ గన్గొన మరి వేళ లేదా
యెలమిఁ జీరఁగట్టిగా నింటిలోనికి వచ్చేవు
మలసి మాటలాడ మరి వేళ లేదా

(॥ఎంత॥)
నెఱులచిక్కుఁ దియ్యఁగా నీ వాడకు వచ్చేవు
వెఱగయ్యీ నీకు మరి వేళ లేదా
తఱి పరిమళమలఁదగా నండకు వచ్చేవు
మఱి పొందుసేయఁగ మంచివేళ లేదా

(॥ఎంత॥)
తోడ నద్దము చూడఁగాఁ దొక్కులాడ వచ్చేవు
వేడుకకు నీకునిట్టె మరి వేళ లేదా
కూడి శ్రీ వేంకటేశుఁడ కొలువుండ వచ్చేవు
మాడుగులోనికిని కమ్మటి వేళ లేదా

(||pallavi||)
ĕṁta kādarīm̐ḍa vemani vinnaviṁcheri
vaṁtugum̐ jirunavvudo vaḍim̐diṭṭīm̐ jĕliya

(||ĕṁta||)
jalagamāḍesoḍigi sārĕm̐ jŏchchivachchevu
vĕlam̐dim̐ gangŏna mari veḽa ledā
yĕlamim̐ jīram̐gaṭṭigā niṁṭilonigi vachchevu
malasi māḍalāḍa mari veḽa ledā

(||ĕṁta||)
nĕṟulasikkum̐ diyyam̐gā nī vāḍagu vachchevu
vĕṟagayyī nīgu mari veḽa ledā
taṟi parimaḽamalam̐dagā naṁḍagu vachchevu
maṟi pŏṁduseyam̐ga maṁchiveḽa ledā

(||ĕṁta||)
toḍa naddamu sūḍam̐gām̐ dŏkkulāḍa vachchevu
veḍugagu nīguniṭṭĕ mari veḽa ledā
kūḍi śhrī veṁkaḍeśhum̐ḍa kŏluvuṁḍa vachchevu
māḍugulonigini kammaḍi veḽa ledā