Emta kaadareem didam demisedune

ఎంత కాతరీఁ డితఁ డేమిసేతునే
Language

(॥పల్లవి॥)
ఎంత కాతరీఁ డితఁ డేమిసేతునే
పంతముతోడ నాకు పైకొనఁగవచ్చునా

(॥ఎంత॥)
సిగ్గులు మూఁటగట్టి చెక్కుచేయి తీసిపెట్టి
యెగ్గులేక నవ్వుమనీ నేమి సేతునే
వొగ్గితా నేమి సేసినా నూరకే యమరుగాక
తగ్గుమొగ్గులేనివానకు మతకించవచ్చునా

(॥ఎంత॥)
గుట్టు బాయిటను వేసి కోరికలు యెగపోసి
ఇట్టె పాదా లొత్తుమనీ నేమిసేతునే
రట్టుగాఁ దా నెట్టుండినా నెట్టన నమరుఁగాక
చుట్టమనయిననాకు జోలిఁబెట్టవచ్చునా

(॥ఎంత॥)
కొంకుగొసరెల్లా మావి కుచము లెదురు వూని
ఇంకాఁ గాఁగిలించుమనీ నేమి సేతునే
అంకె శ్రీవేంకటేశుఁ డని దన కమరుఁగాక
సంకలేనిదాన నాకు సటలాడవచ్చునా

(||pallavi||)
ĕṁta kādarīm̐ ḍidam̐ ḍemisedune
paṁtamudoḍa nāgu paigŏnam̐gavachchunā

(||ĕṁta||)
siggulu mūm̐ṭagaṭṭi sĕkkuseyi tīsibĕṭṭi
yĕggulega navvumanī nemi sedune
vŏggidā nemi sesinā nūrage yamarugāga
taggumŏggulenivānagu madagiṁchavachchunā

(||ĕṁta||)
guṭṭu bāyiḍanu vesi korigalu yĕgabosi
iṭṭĕ pādā lŏttumanī nemisedune
raṭṭugām̐ dā nĕṭṭuṁḍinā nĕṭṭana namarum̐gāga
suṭṭamanayinanāgu jolim̐bĕṭṭavachchunā

(||ĕṁta||)
kŏṁkugŏsarĕllā māvi kusamu lĕduru vūni
iṁkām̐ gām̐giliṁchumanī nemi sedune
aṁkĕ śhrīveṁkaḍeśhum̐ ḍani dana kamarum̐gāga
saṁkalenidāna nāgu saḍalāḍavachchunā