ఎంత కాతరపువాఁడె యెలయించీ నిదె నన్ను
(॥పల్లవి॥)
ఎంత కాతరపువాఁడె యెలయించీ నిదె నన్ను
విత వింత రతులను వినోదించీ నితఁడు
(॥ఎంత॥)
ఆనలు నేఁ బెట్టఁగానే యట్టె వొడివట్టీని
మోనాన నుండఁగానే మోవి యానీని
పూనుక వద్దనుండఁగా పుప్పొడి నామీఁద జల్లీ
తా నెంత నే నెంత తమిరేఁచీ నితఁడు
(॥ఎంత॥)
తలవంచుకుండఁగానే దండఁ గూచుండ వచ్చీని
నిలుచుక వుండఁగానే నించీఁ గాఁగిట
బలిమిఁ బెనఁగఁగానే పట్టీ గుబ్బచన్నులు
వలపులు చల్లి చల్లి వావిచెప్పీ నితఁడు
(॥ఎంత॥)
పరపుపైనుండఁగానే పక్కఁబండి చెనకీని
గిరగొని నవ్వఁగానే గిలిగించీని
యిరవై శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
గరిమ నన్నుఁ బెండ్లాడి కాలుదొక్కీ నితఁడు
(||pallavi||)
ĕṁta kādarabuvām̐ḍĕ yĕlayiṁchī nidĕ nannu
vida viṁta radulanu vinodiṁchī nidam̐ḍu
(||ĕṁta||)
ānalu nem̐ bĕṭṭam̐gāne yaṭṭĕ vŏḍivaṭṭīni
monāna nuṁḍam̐gāne movi yānīni
pūnuga vaddanuṁḍam̐gā puppŏḍi nāmīm̐da jallī
tā nĕṁta ne nĕṁta tamirem̐sī nidam̐ḍu
(||ĕṁta||)
talavaṁchuguṁḍam̐gāne daṁḍam̐ gūsuṁḍa vachchīni
nilusuga vuṁḍam̐gāne niṁchīm̐ gām̐giḍa
balimim̐ bĕnam̐gam̐gāne paṭṭī gubbasannulu
valabulu salli salli vāvisĕppī nidam̐ḍu
(||ĕṁta||)
parabubainuṁḍam̐gāne pakkam̐baṁḍi sĕnagīni
giragŏni navvam̐gāne giligiṁchīni
yiravai śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
garima nannum̐ bĕṁḍlāḍi kāludŏkkī nidam̐ḍu