Emta joodumdanamula deeseliya

ఎంత జూటుఁదనముల దీచెలియ
Language

(॥పల్లవి॥)
ఎంత జూటుఁదనముల దీచెలియ
వింతవింత సింగారాల వెలసీఁ జెలియ

(॥ఎంత॥)
ముంగిట నీ ముందరను మురిసేనంటానేమో
చెంగావిచీరఁ గట్టెఁ జెలియ
చెంగల నీతో సాములు సేసేనంటానేమో
సంగతిగాఁ గస్తూరి చల్లుకొనెఁ జెలియ

(॥ఎంత॥)
వన్నెలువెట్టుక నిన్ను వలపించెనంటానేమో
కన్నలఁగాటుక వెట్టీఁ గడుఁ జెలియ
సన్నలనే నీ కింత చవిచూపేనంటా నేమో
నున్ననిపెదవులను నోరూరించీఁ జెలియ

(॥ఎంత॥)
మనసు గరఁచి నిన్ను మరగించేనంటానేమో
ననుపుసేసుక నీతో నవ్వీఁ జెలియ
యెనసితి విటు నన్ను యిన్నిటా శ్రీవేంకటేశ
తననేరుపులూఁ గొంత తాఁ జూపీ జెలియ

(||pallavi||)
ĕṁta jūḍum̐danamula dīsĕliya
viṁtaviṁta siṁgārāla vĕlasīm̐ jĕliya

(||ĕṁta||)
muṁgiḍa nī muṁdaranu murisenaṁṭānemo
sĕṁgāvisīram̐ gaṭṭĕm̐ jĕliya
sĕṁgala nīdo sāmulu sesenaṁṭānemo
saṁgadigām̐ gastūri sallugŏnĕm̐ jĕliya

(||ĕṁta||)
vannĕluvĕṭṭuga ninnu valabiṁchĕnaṁṭānemo
kannalam̐gāḍuga vĕṭṭīm̐ gaḍum̐ jĕliya
sannalane nī kiṁta savisūbenaṁṭā nemo
nunnanibĕdavulanu norūriṁchīm̐ jĕliya

(||ĕṁta||)
manasu garam̐si ninnu maragiṁchenaṁṭānemo
nanubusesuga nīdo navvīm̐ jĕliya
yĕnasidi viḍu nannu yinniḍā śhrīveṁkaḍeśha
tananerubulūm̐ gŏṁta tām̐ jūbī jĕliya