(॥పల్లవి॥)
ఎంత జాణలే వీరు యింతులాల
వింతలుగ వీది వీది వినోదించేరు
(॥॥)
ఇద్దరు దేవుళ్లుఁ దాము నెదురు దేరులమీఁద
కొద్దిమీర నిమ్మపండ్లఁ గుచ్చి చిమ్మేరు
వొద్దికతో నవ్వుకొంటా నుంటవింట గందపు-
ముద్దలు దాఁకవేసి మోదములు చూచేరు
(॥॥)
వెనకాముందరాను వేడుకతోఁ దేరులు
అనువుగా వెంటవెంట నంటఁ దోలేరు
తనువులు సోఁకఁ జేతి తామరనాళముల
పెనఁగి పైఁబారఁ జాఁచి పిలిచేరు మోవులు
(॥॥)
సందడిలోపలనే సంగడిఁ దేరులు నిల్పి
కందువతోఁ జౌకళించి కాఁగిలించేరు
పొంది శ్రీ వేంకటేశుఁడు భూదేవి నలమేల్మంగా
పెందలికాడనే పెండ్లిపీఁటపై నున్నారు
(||pallavi||)
ĕṁta jāṇale vīru yiṁtulāla
viṁtaluga vīdi vīdi vinodiṁcheru
(||||)
iddaru devuḽlum̐ dāmu nĕduru derulamīm̐da
kŏddimīra nimmabaṁḍlam̐ guchchi simmeru
vŏddigado navvugŏṁṭā nuṁṭaviṁṭa gaṁdabu-
muddalu dām̐kavesi modamulu sūseru
(||||)
vĕnagāmuṁdarānu veḍugadom̐ derulu
anuvugā vĕṁṭavĕṁṭa naṁṭam̐ doleru
tanuvulu som̐kam̐ jedi tāmaranāḽamula
pĕnam̐gi paim̐bāram̐ jām̐si piliseru movulu
(||||)
saṁdaḍilobalane saṁgaḍim̐ derulu nilbi
kaṁduvadom̐ jaugaḽiṁchi kām̐giliṁcheru
pŏṁdi śhrī veṁkaḍeśhum̐ḍu bhūdevi nalamelmaṁgā
pĕṁdaligāḍane pĕṁḍlibīm̐ṭabai nunnāru