(॥పల్లవి॥)
ఎంత జాణతనమూ యెంతనేరుపు
పొంత నీవైనా నాపెకు బుద్దిచెప్పరాదా
(॥ఎ0త॥)
ఆడరి నీప్రియురాలు ఆకుమడిచియ్యఁగాను
యెడచొచ్చి యందుకొనీ యెవ్వతో తాను
తొడిఁబడ నీ కాపె కస్తూరిబొట్టు వెట్టఁగాను
వడువున గోర దిద్దవచ్చీఁ దాను
(॥ఎ0త॥)
పక్కన నీదేవి పీఁటపై నిను నునిచితే
యొక్కుకొనీ నీతోడ యెవ్వతో తాను
అక్కరతోఁ బదములు ఆపె నీపైఁ బాడితేను
చెక్కుచేతఁ దానాలు చెప్పవచ్చీఁ దాను
(॥ఎంత॥)
వలచినయాపె నీవద్దఁ బవ్వళిచఁగాను
యెలమితోఁ గాగిలి0చీ యెవ్వతో తాను
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
తొలుత నీపెఁ గూడితే దొమ్మిఁగూడీఁ దానను
(||pallavi||)
ĕṁta jāṇadanamū yĕṁtanerubu
pŏṁta nīvainā nābĕgu buddisĕpparādā
(||ĕ0ta||)
āḍari nīpriyurālu āgumaḍisiyyam̐gānu
yĕḍasŏchchi yaṁdugŏnī yĕvvado tānu
tŏḍim̐baḍa nī kābĕ kastūribŏṭṭu vĕṭṭam̐gānu
vaḍuvuna gora diddavachchīm̐ dānu
(||ĕ0ta||)
pakkana nīdevi pīm̐ṭabai ninu nuniside
yŏkkugŏnī nīdoḍa yĕvvado tānu
akkaradom̐ badamulu ābĕ nībaim̐ bāḍidenu
sĕkkusedam̐ dānālu sĕppavachchīm̐ dānu
(||ĕṁta||)
valasinayābĕ nīvaddam̐ bavvaḽisam̐gānu
yĕlamidom̐ gāgili0chī yĕvvado tānu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
tŏluda nībĕm̐ gūḍide dŏmmim̐gūḍīm̐ dānanu