Emta jaana neeseliya nemani pogadavachchu

ఎంత జాణ నీచెలియ నేమని పొగడవచ్చు
Language

(॥పల్లవి॥)
ఎంత జాణ నీచెలియ నేమని పొగడవచ్చు
దొంతుల మాఁటలలోనే దోమటి దొడికెను

(॥ఎంత॥)
మెట్టిన చమ్మాళిగలు మించఁ బారితెంచి నిన్ను
పట్టితీసి మొలనూలు పైపై చెలి
అట్టె కోపాన నీవు ఆఁపలేక పెనఁగఁగ
తిట్టెన నీమోవి గంటి తెగి సేసెనప్పుడే

(॥ఎంత॥)
వంచిన పయ్యదకొంగు వల్లెవాటు వేసుకొని
కొంచక నీమొగమై కొనగోరను
ఇంచుకంత నీవందుకు యియ్యకొనకుండఁగాను
ముంచి నిన్నుఁ దనచను మొనలనాఁగీని

(॥ఎంత॥)
వాకునిండా కస్తూరివాసనలు చల్లి చల్లి
యేకతమాడి చెలి యిప్పుడే నీతోను
యీకడ శ్రీ వేంకటేశ యియ్యకొని కూడఁగాను
లోకము మెచ్చేటి నిన్ను లోను కొనెను

(||pallavi||)
ĕṁta jāṇa nīsĕliya nemani pŏgaḍavachchu
dŏṁtula mām̐ṭalalone domaḍi dŏḍigĕnu

(||ĕṁta||)
mĕṭṭina sammāḽigalu miṁcham̐ bāridĕṁchi ninnu
paṭṭidīsi mŏlanūlu paibai sĕli
aṭṭĕ kobāna nīvu ām̐palega pĕnam̐gam̐ga
tiṭṭĕna nīmovi gaṁṭi tĕgi sesĕnappuḍe

(||ĕṁta||)
vaṁchina payyadagŏṁgu vallĕvāḍu vesugŏni
kŏṁchaga nīmŏgamai kŏnagoranu
iṁchugaṁta nīvaṁdugu yiyyagŏnaguṁḍam̐gānu
muṁchi ninnum̐ danasanu mŏnalanām̐gīni

(||ĕṁta||)
vāguniṁḍā kastūrivāsanalu salli salli
yegadamāḍi sĕli yippuḍe nīdonu
yīgaḍa śhrī veṁkaḍeśha yiyyagŏni kūḍam̐gānu
logamu mĕchcheḍi ninnu lonu kŏnĕnu