Emta guttusesugoni yikkada nunnaamdavu

ఎంత గుట్టుచేసుకొని యిక్కడ నున్నాఁడవు
Language

(॥పల్లవి॥)
ఎంత గుట్టుచేసుకొని యిక్కడ నున్నాఁడవు
చెంత నాపె చెప్పినట్లు చేయఁగరాదా

(॥ఎంత॥)
తేనెపదవుల నీతోఁ దెఱవ మాటలాడె
కానుకవట్టెను చెనుఁగవ నీకును
నానఁబెట్టి సెలవులనవ్వులు నీపైఁ జల్లె
కానిమ్మని యాపెయింటికాడకురారాదా

(॥ఎంత॥)
వెస నీ కొలువు చేసి వినయములెల్లాఁ జూపె
పొసఁగ నిచ్చకములఁ బొందుచేసెను
సుసరవువలపులఁ జుట్టరికము నెఱపె
కొసరీ నాపెవద్దఁ గూచుండరాదా

(॥ఎంత॥)
మక్కువఁ బాదములొత్తి మమ్మములెల్లా రేఁచె
మిక్కిలి రతులఁగూడి మెప్పించెను
చక్కని శ్రీవేంకటేశ సన్నల నొడఁబరచె
చొక్కపునేర్పుల నాపెఁ జొక్కించరాదా

(||pallavi||)
ĕṁta guṭṭusesugŏni yikkaḍa nunnām̐ḍavu
sĕṁta nābĕ sĕppinaṭlu seyam̐garādā

(||ĕṁta||)
tenĕbadavula nīdom̐ dĕṟava māḍalāḍĕ
kānugavaṭṭĕnu sĕnum̐gava nīgunu
nānam̐bĕṭṭi sĕlavulanavvulu nībaim̐ jallĕ
kānimmani yābĕyiṁṭigāḍagurārādā

(||ĕṁta||)
vĕsa nī kŏluvu sesi vinayamulĕllām̐ jūbĕ
pŏsam̐ga nichchagamulam̐ bŏṁdusesĕnu
susaravuvalabulam̐ juṭṭarigamu nĕṟabĕ
kŏsarī nābĕvaddam̐ gūsuṁḍarādā

(||ĕṁta||)
makkuvam̐ bādamulŏtti mammamulĕllā rem̐sĕ
mikkili radulam̐gūḍi mĕppiṁchĕnu
sakkani śhrīveṁkaḍeśha sannala nŏḍam̐barasĕ
sŏkkabunerbula nābĕm̐ jŏkkiṁcharādā