ఎంత గుట్టుగలవాఁడ విదివో నీవు నీ
(॥పల్లవి॥)
ఎంత గుట్టుగలవాఁడ విదివో నీవు నీ -
యంతరంగురాల నాతో నానతియ్యరాదా
(॥॥)
వలచితినని నాతో వాకున నాడవు గాని
చెలపచెమట లుభ్బీఁ జెక్కున నీకు
నెలకొన్నతమకము నీలోనే దాఁచేవుగాని
వెలయ నిట్టూర్పు వెల్లవిరి సేసీని
(॥॥)
చెనకి నన్నుఁగలయ సిగ్గులువడేవు గాని
మనసులో గుబ్బతిల్లీ మచ్చికలెల్లా
గొనకొన్న చూపులు గురులు సేయవుగాని
తనువునఁ బులకలు తతిగొనీని
(॥॥)
పచ్చి దేరే యాసలు బయలు సేయవుగాని
నిచ్చలపు వెరగులే నిలువెల్లాను
ఇచ్చకపు శ్రీ వేంకటేశ నన్నుఁగూడితివి
అచ్చకపు మదనకళ లవిగో మోమునను
(||pallavi||)
ĕṁta guṭṭugalavām̐ḍa vidivo nīvu nī -
yaṁtaraṁgurāla nādo nānadiyyarādā
(||||)
valasidinani nādo vāguna nāḍavu gāni
sĕlabasĕmaḍa lubhbīm̐ jĕkkuna nīgu
nĕlagŏnnadamagamu nīlone dām̐sevugāni
vĕlaya niṭṭūrbu vĕllaviri sesīni
(||||)
sĕnagi nannum̐galaya sigguluvaḍevu gāni
manasulo gubbadillī machchigalĕllā
gŏnagŏnna sūbulu gurulu seyavugāni
tanuvunam̐ bulagalu tadigŏnīni
(||||)
pachchi dere yāsalu bayalu seyavugāni
nichchalabu vĕragule niluvĕllānu
ichchagabu śhrī veṁkaḍeśha nannum̐gūḍidivi
achchagabu madanagaḽa lavigo momunanu