Emta gunavamturaalu yee sadi neegu

ఎంత గుణవంతురాలు యీ సతి నీకు
Language

(॥పల్లవి॥)
ఎంత గుణవంతురాలు యీ సతి నీకు
చెంత నిన్ను మెచ్చుఁగాని చిడుముడిపడదు

(॥ఎంత॥)
యేమి నీవుసేసినాను ఇచ్చకమే ఆడుఁగాని
కామిని యెంతైన నీతోఁ గాఁతాళించదు
జాము వోయి వచ్చినాను సంతోసించుకొనుఁగాని
మోము చిన్నఁబుచ్చుకొని మొక్కలాన దూరదు

(॥ఎంత॥)
నిగిడి పరాకైనా నిన్ను నెచ్చరించుఁగాని
మగువ నీనేరాలెంచి మరి పాయదు
మిగులా నీ వెవ్వరితో నగినాఁ జెలఁగుఁ గాని
యెగసక్కెమున నిన్ను నెరపులు సేయదు

(॥ఎంత॥)
పిలువక నీ వుండినా పెనఁగి పైకొనుఁగాని
చలములు నీతోను సాదించదు
యెలమి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
మెలగి నీవుగూడినమేలు మరవదు

(||pallavi||)
ĕṁta guṇavaṁturālu yī sadi nīgu
sĕṁta ninnu mĕchchum̐gāni siḍumuḍibaḍadu

(||ĕṁta||)
yemi nīvusesinānu ichchagame āḍum̐gāni
kāmini yĕṁtaina nīdom̐ gām̐tāḽiṁchadu
jāmu voyi vachchinānu saṁtosiṁchugŏnum̐gāni
momu sinnam̐buchchugŏni mŏkkalāna dūradu

(||ĕṁta||)
nigiḍi parāgainā ninnu nĕchchariṁchum̐gāni
maguva nīnerālĕṁchi mari pāyadu
migulā nī vĕvvarido naginām̐ jĕlam̐gum̐ gāni
yĕgasakkĕmuna ninnu nĕrabulu seyadu

(||ĕṁta||)
piluvaga nī vuṁḍinā pĕnam̐gi paigŏnum̐gāni
salamulu nīdonu sādiṁchadu
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
mĕlagi nīvugūḍinamelu maravadu