ఎంత గయ్యాళివనరా యిరుగుపొరుగువారు
(॥పల్లవి॥)
ఎంత గయ్యాళివనరా యిరుగుపొరుగువారు
పంతముతో నీవేల బలిమి సేసేవే
(॥॥)
గుట్టుతో మెల్లనే పతి కొసరి మాటలాడగ
ఱట్టుగా దూరనేలే యాఱడిగా నీవు
చెట్టవట్టి యాతఁడు చేతికి లోనై యుండఁగ
వొట్టువెట్టి నీవేల వొడివట్టేవే
(॥॥)
రమణుఁడాతఁడు నిన్ను రతికిఁ బిలువఁగాను
తమకించి నీవేల కాఁతాళించేవే
సముకానఁ దానే మరి సరసములాడఁగాను
నెమకుచు నీవేల నేర మెంచేవే
(॥॥)
శ్రీవేంకటేశుఁడే చేరి నిన్నుఁ గూడగాను
వావులేల చెప్పేవే వరుసతోను
వోవరిలోఁదా నిన్ను వురమెక్కించుకొనఁగ
యీవేళ నీవేల మోవి యెంగిలిసేసేవే
(||pallavi||)
ĕṁta gayyāḽivanarā yirugubŏruguvāru
paṁtamudo nīvela balimi seseve
(||||)
guṭṭudo mĕllane padi kŏsari māḍalāḍaga
ṟaṭṭugā dūranele yāṟaḍigā nīvu
sĕṭṭavaṭṭi yādam̐ḍu sedigi lonai yuṁḍam̐ga
vŏṭṭuvĕṭṭi nīvela vŏḍivaṭṭeve
(||||)
ramaṇum̐ḍādam̐ḍu ninnu radigim̐ biluvam̐gānu
tamagiṁchi nīvela kām̐tāḽiṁcheve
samugānam̐ dāne mari sarasamulāḍam̐gānu
nĕmagusu nīvela nera mĕṁcheve
(||||)
śhrīveṁkaḍeśhum̐ḍe seri ninnum̐ gūḍagānu
vāvulela sĕppeve varusadonu
vovarilom̐dā ninnu vuramĕkkiṁchugŏnam̐ga
yīveḽa nīvela movi yĕṁgiliseseve