Emta gattuvaayavaidi veme neevu

ఎంత గట్టువాయవైతి వేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత గట్టువాయవైతి వేమే నీవు
అంతలో నీతొడ మోపే వాతనిపై నీవు

(॥ఎంత॥)
హత్తుకొని చదరంగ మాతడుఁ నేను నాడఁగా
యెత్తులు చెప్పవచ్చేవు యేమే నీవు
యిత్తల నేఁ బరాకైతే నిదేసందుగా నాతని -
నోత్తేవు కొనగోర నోల్లనే నీవు

(॥ఎంత॥)
పచ్చిమాట లాతఁడు నాపై మోవనాడితేను
ఇచ్చకాలకు నవ్వే వేమే నీవు
కొచ్చి నేను తలవంచుకొనివుండఁగా నాతనిఁ
దచ్చి నీచన్నుల వీఁపు దాఁకించేవు నీవు

(॥ఎంత॥)
గెలిచి నేఁ బెనఁగఁగా కెరలి నీవూ నాతని -
నెలమిఁ గాఁగిట నించే వేమే నీవు
అలమేల్‌మంగను నేను ఆతఁడు శ్రీవేంకటేశుఁ-
డిల నన్నేలె నాతని కేమౌదువే నీవు

(||pallavi||)
ĕṁta gaṭṭuvāyavaidi veme nīvu
aṁtalo nīdŏḍa mobe vādanibai nīvu

(||ĕṁta||)
hattugŏni sadaraṁga mādaḍum̐ nenu nāḍam̐gā
yĕttulu sĕppavachchevu yeme nīvu
yittala nem̐ barāgaide nidesaṁdugā nādani -
nottevu kŏnagora nollane nīvu

(||ĕṁta||)
pachchimāḍa lādam̐ḍu nābai movanāḍidenu
ichchagālagu navve veme nīvu
kŏchchi nenu talavaṁchugŏnivuṁḍam̐gā nādanim̐
dachchi nīsannula vīm̐pu dām̐kiṁchevu nīvu

(||ĕṁta||)
gĕlisi nem̐ bĕnam̐gam̐gā kĕrali nīvū nādani -
nĕlamim̐ gām̐giḍa niṁche veme nīvu
alamel‌maṁganu nenu ādam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍila nannelĕ nādani kemauduve nīvu