Emta gattuvaayavaamda vemi seppedi

ఎంత గట్టువాయవాఁడ వేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత గట్టువాయవాఁడ వేమి చెప్పేది
కాంత సేవలల్లా నీవు కనుఁగొనరాదా

(॥ఎంత॥)
పొలిఁతి నీ కిందాఁకాను బోనము వడ్డించెను
పిలిచి యాకెఁ బొత్తునఁ బెట్టుకోరాదా
పలుమారు నిందాఁకాఁ బాదాలు విసికెను
అలసి పక్కఁ బండంగ నప్పణీయరాదా

(॥ఎంత॥)
అప్పటినుండిఁ దాను ఆకుమడిచి యిచ్చెను
వొప్పుగఁ దమ్ముల మాకె కొసఁగరాదా
చొప్పులెత్తి వూరిలోనిసుద్దులెల్లా నీకుఁ జెప్పె
కప్పి పచ్చడములోనఁ గాగిలించరాదా

(॥ఎంత॥)
సరుసఁ గూచుండి నీతో జాగరాలు సేసెను
నిరతితో రతులెల్లా నేరుపరాదా
యిరవై శ్రీవేంకటేశ యీకె యలమేల్మంగ
సరవి నేలితి విట్టె చనవియ్యరాదా

(||pallavi||)
ĕṁta gaṭṭuvāyavām̐ḍa vemi sĕppedi
kāṁta sevalallā nīvu kanum̐gŏnarādā

(||ĕṁta||)
pŏlim̐ti nī kiṁdām̐kānu bonamu vaḍḍiṁchĕnu
pilisi yāgĕm̐ bŏttunam̐ bĕṭṭugorādā
palumāru niṁdām̐kām̐ bādālu visigĕnu
alasi pakkam̐ baṁḍaṁga nappaṇīyarādā

(||ĕṁta||)
appaḍinuṁḍim̐ dānu āgumaḍisi yichchĕnu
vŏppugam̐ dammula māgĕ kŏsam̐garādā
sŏppulĕtti vūrilonisuddulĕllā nīgum̐ jĕppĕ
kappi pachchaḍamulonam̐ gāgiliṁcharādā

(||ĕṁta||)
sarusam̐ gūsuṁḍi nīdo jāgarālu sesĕnu
niradido radulĕllā nerubarādā
yiravai śhrīveṁkaḍeśha yīgĕ yalamelmaṁga
saravi nelidi viṭṭĕ sanaviyyarādā