Emta gattuvaayadana mideme veemdu

ఎంత గట్టువాయతన మిదేమే వీఁడు
Language

(॥పల్లవి॥)
ఎంత గట్టువాయతన మిదేమే వీఁడు
అంతకంత కేమన్నా నస మీఁడే వీఁడు

(॥ఎంత॥)
నిద్దుర కన్నులఁ దేరి నీకంటే లే దంటా
గద్దించి తప్పక చూచీఁ గదే వీఁడు
ముద్దుతో నెగసక్కేల మోవికెంపులు రేఁచితే
వొద్దన లేక వోరిచి వున్నాఁడె వీఁడు

(॥ఎంత॥)
ముక్కున నూర్పులు నీకు ముంచె నంటె లే దంటా
అక్కిలించి లోనోనె ఆఁపీనె వీఁడు
అక్కడ నలసి వచ్చే నందుపై నేఁ బెనఁగితె
అక్కరతో రతులకై ఆసపడీ వీఁడు

(॥ఎంత॥)
చెమటలు తన మేను చెరఁగునఁ గప్పీతేను
అమర ముసుఁగు వెట్టీ నప్పటి వీఁడు
తమితో శ్రీవెంకటేశుఁ దగ నిందుకె మెచ్చితే
భ్రమసినట్లఁ బైపైఁ గూడీ వీఁడు

(||pallavi||)
ĕṁta gaṭṭuvāyadana mideme vīm̐ḍu
aṁtagaṁta kemannā nasa mīm̐ḍe vīm̐ḍu

(||ĕṁta||)
niddura kannulam̐ deri nīgaṁṭe le daṁṭā
gaddiṁchi tappaga sūsīm̐ gade vīm̐ḍu
muddudo nĕgasakkela movigĕṁpulu rem̐side
vŏddana lega vorisi vunnām̐ḍĕ vīm̐ḍu

(||ĕṁta||)
mukkuna nūrbulu nīgu muṁchĕ naṁṭĕ le daṁṭā
akkiliṁchi lononĕ ām̐pīnĕ vīm̐ḍu
akkaḍa nalasi vachche naṁdubai nem̐ bĕnam̐gidĕ
akkarado radulagai āsabaḍī vīm̐ḍu

(||ĕṁta||)
sĕmaḍalu tana menu sĕram̐gunam̐ gappīdenu
amara musum̐gu vĕṭṭī nappaḍi vīm̐ḍu
tamido śhrīvĕṁkaḍeśhum̐ daga niṁdugĕ mĕchchide
bhramasinaṭlam̐ baibaim̐ gūḍī vīm̐ḍu