ఎంత గట్టు వాయవే యేమే నీవు వోరి
(॥పల్లవి॥)
ఎంత గట్టు వాయవే యేమే నీవు వోరి
పంతాన నందులో నీవు పంచుకోరా సగము
(॥ఎంత॥)
పట్టుకోవే కొంగు జారీఁ గామిని, నీకు
గట్టి తమ్మ చెక్కులంటెఁ గడుగుకోరా
తొట్టి పెంజెమటలు తుడుచుకోవే నీవే
బెట్టాయ కెంపులతోడిపెదవి మూసుకోరా
(॥ఎంత॥)
చన్నులకు దిష్టి దాఁకీ తి మూయవే, యాడో
కన్నెమేని పస పంటె కప్పించుకోరా
పన్ని నోర పచ్చి గారీ పలుకకువే, మేలు
నున్న నీ సిగ్గులు నీ కన్నులనే పడెరా
(॥ఎంత॥)
బెరయఁ బిఱుఁదువేఁగు పీఁటయెక్కవే, మంచి
వురము నీకుఁ వేలవు వోరుతువురా
సరుఁస గూచుంటి వౌనే సరసతలా నన్ను
గరిమ శ్రీవేంకటేశ కలసితి వవురా
(||pallavi||)
ĕṁta gaṭṭu vāyave yeme nīvu vori
paṁtāna naṁdulo nīvu paṁchugorā sagamu
(||ĕṁta||)
paṭṭugove kŏṁgu jārīm̐ gāmini, nīgu
gaṭṭi tamma sĕkkulaṁṭĕm̐ gaḍugugorā
tŏṭṭi pĕṁjĕmaḍalu tuḍusugove nīve
bĕṭṭāya kĕṁpuladoḍibĕdavi mūsugorā
(||ĕṁta||)
sannulagu diṣhṭi dām̐kī ti mūyave, yāḍo
kannĕmeni pasa paṁṭĕ kappiṁchugorā
panni nora pachchi gārī palugaguve, melu
nunna nī siggulu nī kannulane paḍĕrā
(||ĕṁta||)
bĕrayam̐ biṟum̐duvem̐gu pīm̐ṭayĕkkave, maṁchi
vuramu nīgum̐ velavu voruduvurā
sarum̐sa gūsuṁṭi vaune sarasadalā nannu
garima śhrīveṁkaḍeśha kalasidi vavurā