(॥పల్లవి॥)
ఎంత గలదే యింకా నీ మోహము
యింతిరో నీకే చెల్లు నీ మోహము
(॥ఎంత॥)
నిక్కి నిక్కి చూచేవు నెయ్యములే తాచేవు
చక్కనిరమణునితో సారె సారెకు
చెక్కునఁ జెయి వెట్టేవు చెమటలే నించేవు
యెక్కడ నేరిచితివి యింతమోహము
(॥ఎంత॥)
కన్నులు దేలించేవు కాఁకలు పైఁజల్లేవు
యిన్నిటాను నీ విభునియెదురెదుర
చన్నులకొంగు జారేవు జంటలేక పెనఁగేవు
యెన్నికలతుద మీరె యీమోహము
(॥ఎంత॥)
కడుఁగడు నవ్వేవు కాఁగిట బిగించేవు
యెడయక శ్రీవేంకటేశ్వరుని
తొడిఁబడఁ గూడితివి దొమ్మిరతిఁ దేవితివి
యిడుపునఁ జేర్చితి యీ మోహము
(||pallavi||)
ĕṁta galade yiṁkā nī mohamu
yiṁtiro nīge sĕllu nī mohamu
(||ĕṁta||)
nikki nikki sūsevu nĕyyamule tāsevu
sakkaniramaṇunido sārĕ sārĕgu
sĕkkunam̐ jĕyi vĕṭṭevu sĕmaḍale niṁchevu
yĕkkaḍa nerisidivi yiṁtamohamu
(||ĕṁta||)
kannulu deliṁchevu kām̐kalu paim̐jallevu
yinniḍānu nī vibhuniyĕdurĕdura
sannulagŏṁgu jārevu jaṁṭalega pĕnam̐gevu
yĕnnigaladuda mīrĕ yīmohamu
(||ĕṁta||)
kaḍum̐gaḍu navvevu kām̐giḍa bigiṁchevu
yĕḍayaga śhrīveṁkaḍeśhvaruni
tŏḍim̐baḍam̐ gūḍidivi dŏmmiradim̐ devidivi
yiḍubunam̐ jersidi yī mohamu