ఎంత గద్దు నీ యాస యింకా నోయి
(॥పల్లవి॥)
ఎంత గద్దు నీ యాస యింకా నోయి
వింతవారమా నేము వెరవకు వోయీ
(॥ఎంత॥)
పొరుగున వేగినంతా పొలఁతిఁ గూడుండి, మాతో
సరసములాడేవు వేసరవా వోయి
అరసి ముచ్చటాడేవు అందుఁ జాలక ఇక్కడ
వరుసకు నీనోరు నొవ్వదా వోయి
(॥ఎంత॥)
వొట్టుక ఇందాఁక ఆపె వద్ద నుండి, మాదిక్కు
నిట్టచూపు చూచేవు తనియవా వోయి
బెట్టుగా నాపె చన్నులు పిసికి, నాచన్ను లంటే-
విట్టే వుక్కునఁ జేసిరా యీచేతు లోఇ
(॥ఎంత॥)
నాఁట నాపెఁ గాఁగిలించి నన్నుఁ గాఁగిలించితివి
పూఁటవూఁట కింతేసి వోపుదువా వోయి
నీటున శ్రీ వేంకటేశ నే నలమేల్మంగనని
పాటించి చెక్కునొక్కేవు పై కొసరా వోయి
(||pallavi||)
ĕṁta gaddu nī yāsa yiṁkā noyi
viṁtavāramā nemu vĕravagu voyī
(||ĕṁta||)
pŏruguna veginaṁtā pŏlam̐tim̐ gūḍuṁḍi, mādo
sarasamulāḍevu vesaravā voyi
arasi muchchaḍāḍevu aṁdum̐ jālaga ikkaḍa
varusagu nīnoru nŏvvadā voyi
(||ĕṁta||)
vŏṭṭuga iṁdām̐ka ābĕ vadda nuṁḍi, mādikku
niṭṭasūbu sūsevu taniyavā voyi
bĕṭṭugā nābĕ sannulu pisigi, nāsannu laṁṭe-
viṭṭe vukkunam̐ jesirā yīsedu loi
(||ĕṁta||)
nām̐ṭa nābĕm̐ gām̐giliṁchi nannum̐ gām̐giliṁchidivi
pūm̐ṭavūm̐ṭa kiṁtesi vobuduvā voyi
nīḍuna śhrī veṁkaḍeśha ne nalamelmaṁganani
pāḍiṁchi sĕkkunŏkkevu pai kŏsarā voyi