ఎంత గద్దో నీ యాసోద మింకాఁ జూతము కాని
(॥పల్లవి॥)
ఎంత గద్దో నీ యాసోద మింకాఁ జూతము కాని
చెంత నాతఁ డెప్పుడూ నాచేతిలోనివాఁడు
(॥ఎంత॥)
చనవునఁ బతితోను సరసము లాడేవు
మనవులు చెప్పేవు మాపురాఁకాను
పనివూని ఇంతటికిఁ బరవంజుకొంటివి
తనివోని వలపులు తవ్వి పోసుకోవే
(॥ఎంత॥)
సారె సారె నవ్వుకొంటా సంగడిఁ గూచుండేవు
పారుపత్యాలు సేసేవు పతిమారుగా
వూరఁగల దొరతనా లొడిలఁగట్టుకొంటివి
పారితెంచి పగటులు బండిఁబెట్టుకోవే
(॥ఎంత॥)
వుక్కుమీరి సేయరాని వూడిగాలు సేసేవు
కక్కసించి గుబ్బలను కడు నూఁదేవు
యిక్కడ శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
తక్కక నీ కోరికలు తలకెత్తుకోవే
(||pallavi||)
ĕṁta gaddo nī yāsoda miṁkām̐ jūdamu kāni
sĕṁta nādam̐ ḍĕppuḍū nāsedilonivām̐ḍu
(||ĕṁta||)
sanavunam̐ badidonu sarasamu lāḍevu
manavulu sĕppevu māburām̐kānu
panivūni iṁtaḍigim̐ baravaṁjugŏṁṭivi
tanivoni valabulu tavvi posugove
(||ĕṁta||)
sārĕ sārĕ navvugŏṁṭā saṁgaḍim̐ gūsuṁḍevu
pārubatyālu sesevu padimārugā
vūram̐gala dŏradanā lŏḍilam̐gaṭṭugŏṁṭivi
pāridĕṁchi pagaḍulu baṁḍim̐bĕṭṭugove
(||ĕṁta||)
vukkumīri seyarāni vūḍigālu sesevu
kakkasiṁchi gubbalanu kaḍu nūm̐devu
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
takkaga nī korigalu talagĕttugove