ఎంత గబ్బితనమే నీకింతటిలోనే । తొల్లె
(॥పల్లవి॥)
ఎంత గబ్బితనమే నీకింతటిలోనే । తొల్లె
యింత నీ కుపదేశ మిచ్చినదె కదరా
(॥ఎంత॥)
పడఁతి నాపేరు నీవు పాదమున వ్రాతురటె
అడియాలముగ నింతె అందుకేమిరా
వొడికములైతే నీవురమున వాయరాదా
యెడ చాల దందుఁ గుచా లిమ్ముకొనెఁగదరా
(॥ఎంత॥)
నీలపు బెండెములోన వీడ భావింతురటే
తాలిమి నా ప్రియమింతె దానికేమిరా
అలాగైతే నాయద్దపు జెక్కులు గావా
చాలుకొన్నకళ లందే సందుకొనీఁగదరా
(॥ఎంత॥)
కూరిమి నాచెక్కు కొనగోర నంటుదురటే
ఆరసి కూడితివి నన్నందుకేమిరా
యీరీతి శ్రీవేంకటేశుడ నేఁ గాదా
తేరకొన విన్నియు నీ తేకువ గా దటరా
(||pallavi||)
ĕṁta gabbidaname nīgiṁtaḍilone | tŏllĕ
yiṁta nī kubadeśha michchinadĕ kadarā
(||ĕṁta||)
paḍam̐ti nāberu nīvu pādamuna vrāduraḍĕ
aḍiyālamuga niṁtĕ aṁdugemirā
vŏḍigamulaide nīvuramuna vāyarādā
yĕḍa sāla daṁdum̐ gusā limmugŏnĕm̐gadarā
(||ĕṁta||)
nīlabu bĕṁḍĕmulona vīḍa bhāviṁturaḍe
tālimi nā priyamiṁtĕ dānigemirā
alāgaide nāyaddabu jĕkkulu gāvā
sālugŏnnagaḽa laṁde saṁdugŏnīm̐gadarā
(||ĕṁta||)
kūrimi nāsĕkku kŏnagora naṁṭuduraḍe
ārasi kūḍidivi nannaṁdugemirā
yīrīdi śhrīveṁkaḍeśhuḍa nem̐ gādā
teragŏna vinniyu nī teguva gā daḍarā