ఎంత గబ్బితనమే నీ కింత లోననే
(॥పల్లవి॥)
ఎంత గబ్బితనమే నీ కింత లోననే
మంతనపు వినయాల మానినివి నీవు
(॥ఎంత॥)
కొండవంటిదొర వచ్చి కోరి వాకిట నుండఁగా
అండనున్నచెలులు ప్రియము చెప్పఁగా-
నిండుకొన్నచలమున నిలుచున్నదానవు నీ -
గుండె యెంతరాయే కడుఁగోమలివి నీవు
(॥ఎంత॥)
చేరి నీవిభుఁడు నిన్ను చెట్టవట్టి వేఁడుకోగా
కోరికలు నీలోనే కొనసాగఁగా
మారుకొన్నయలుకతో మాటలాడే వతనితో
సారె నింతవెగటేలే జవ్వనివి నీవు
(॥ఎంత॥)
ఇంతటి శ్రీవేంకటేశుఁ డెనసి బాసలియ్యఁగా
సంతమై మరుబలమే సాకిరిగాఁగా
వింతరతులను చొక్కి వెరగుతో నుందానవు
చింత ఇఁకనేలే మేలు చేకొన్నదానవు
(||pallavi||)
ĕṁta gabbidaname nī kiṁta lonane
maṁtanabu vinayāla māninivi nīvu
(||ĕṁta||)
kŏṁḍavaṁṭidŏra vachchi kori vāgiḍa nuṁḍam̐gā
aṁḍanunnasĕlulu priyamu sĕppam̐gā-
niṁḍugŏnnasalamuna nilusunnadānavu nī -
guṁḍĕ yĕṁtarāye kaḍum̐gomalivi nīvu
(||ĕṁta||)
seri nīvibhum̐ḍu ninnu sĕṭṭavaṭṭi vem̐ḍugogā
korigalu nīlone kŏnasāgam̐gā
mārugŏnnayalugado māḍalāḍe vadanido
sārĕ niṁtavĕgaḍele javvanivi nīvu
(||ĕṁta||)
iṁtaḍi śhrīveṁkaḍeśhum̐ ḍĕnasi bāsaliyyam̐gā
saṁtamai marubalame sāgirigām̐gā
viṁtaradulanu sŏkki vĕragudo nuṁdānavu
siṁta im̐kanele melu segŏnnadānavu