Emta gabbidanamani yemchagumee

ఎంత గబ్బితనమని యెంచకుమీ
Language

(॥పల్లవి॥)
ఎంత గబ్బితనమని యెంచకుమీ
చెంతనున్న చెలులము చెల్లు మాకుఁ జుమ్మీ

(॥ఎంత॥)
చెలియకు మాఁటపట్టు సేసినాఁడవు గనుక
వెలయ నీకొ త్తి విన్న విన్నవించితిమి
యెలమి నాపెవలపు యెరుఁగుదువు గనక
పిలిచి కొంగువట్టి పెనఁగితిమి

(॥ఎంత॥)
మగుపను నీ వింతేసి మన్నింతువు గనక
బిగిసి యాపెపై నాన వెట్టితిమి
పగటున నీవు గడుబత్తిగలవు గనుక
సొగిసి నీతో నింత సొలసితిమి

(॥ఎంత॥)
యిందుముఖికిఁ జనవు లిచ్చినాఁడవు గనక
అందలానఁ దెచ్చితిమి యలమి నిన్ను
యిందు నీకెను శ్రీవేంకటేశ యేలితి గనక
ముందు ముందుగా నీకు మొక్కితిమి

(||pallavi||)
ĕṁta gabbidanamani yĕṁchagumī
sĕṁtanunna sĕlulamu sĕllu māgum̐ jummī

(||ĕṁta||)
sĕliyagu mām̐ṭabaṭṭu sesinām̐ḍavu ganuga
vĕlaya nīgŏ tti vinna vinnaviṁchidimi
yĕlami nābĕvalabu yĕrum̐guduvu ganaga
pilisi kŏṁguvaṭṭi pĕnam̐gidimi

(||ĕṁta||)
magubanu nī viṁtesi manniṁtuvu ganaga
bigisi yābĕbai nāna vĕṭṭidimi
pagaḍuna nīvu gaḍubattigalavu ganuga
sŏgisi nīdo niṁta sŏlasidimi

(||ĕṁta||)
yiṁdumukhigim̐ janavu lichchinām̐ḍavu ganaga
aṁdalānam̐ dĕchchidimi yalami ninnu
yiṁdu nīgĕnu śhrīveṁkaḍeśha yelidi ganaga
muṁdu muṁdugā nīgu mŏkkidimi