ఎంత గారవించేవు యేమిబాఁతి నే నీకు
(॥పల్లవి॥)
ఎంత గారవించేవు యేమిబాఁతి నే నీకు
దొంతర బత్తి సేయఁగ దొరనైతిని
(॥॥)
భావించి చూచితేఁ దొల్లి పడచుదానను నేను
నీవు మన్నించి యేలాఁగా నెలఁత నైతి
వావి దెలుసుకొంటేను వదినమాత్రము నేను
దేవుల జేసుకొనఁగ దిట్ట నైతిని
(॥॥)
గట్టిగా విచారించితే కడుముద్దరాల నేను
నెట్టన బుద్దిచెప్పఁగా నేర్పరినైతి
చుట్టరిక మెంచితే మెచ్చుగ మరఁదల నేను
పట్టముగట్టఁగ నింతప్రౌఢనైతి
(॥॥)
చెంగటఁ బాలజలధి సేరి నీవురమున-
నంగవించఁగా నలమేల్మంగనై తిని
రంగగు శ్రీ వేంకటేశ రతి గూడే మేనదాన
ముంగిటినీకృపచేత మోహవతి నైతి
(||pallavi||)
ĕṁta gāraviṁchevu yemibām̐ti ne nīgu
dŏṁtara batti seyam̐ga dŏranaidini
(||||)
bhāviṁchi sūsidem̐ dŏlli paḍasudānanu nenu
nīvu manniṁchi yelām̐gā nĕlam̐ta naidi
vāvi dĕlusugŏṁṭenu vadinamātramu nenu
devula jesugŏnam̐ga diṭṭa naidini
(||||)
gaṭṭigā visāriṁchide kaḍumuddarāla nenu
nĕṭṭana buddisĕppam̐gā nerbarinaidi
suṭṭariga mĕṁchide mĕchchuga maram̐dala nenu
paṭṭamugaṭṭam̐ga niṁtaprauḍhanaidi
(||||)
sĕṁgaḍam̐ bālajaladhi seri nīvuramuna-
naṁgaviṁcham̐gā nalamelmaṁganai tini
raṁgagu śhrī veṁkaḍeśha radi gūḍe menadāna
muṁgiḍinīkṛpaseda mohavadi naidi