ఎంత ఎంత సేసీనే యేఁటికే నాతో
(॥పల్లవి॥)
ఎంత ఎంత సేసీనే యేఁటికే నాతో
పంతములు నెరపీనో పైకొనీనో కాని
(॥ఎంత॥)
కనురెప్ప వేసీఁగదె కాంత దను నేఁ జూచితే
చెనకీని కోపమో సిగ్గో కాని
చనుఁగొంగు మూసీఁగదే సరస నేఁ గూచుండితే
వెనక నానేరాలకో వేసాలకో కాని
(॥ఎంత॥)
తల వంచుకొనీఁగదే తనలో నే మాటాడితే
బలిమి రాజసమో పరాకో కాని
కిలకిల నవ్వీఁగదే కేలు సేఁ బట్టి తీసితే
కెలనివారు మెచ్చనో కేరడమో కాని
(॥ఎత॥)
పవళఙించీ నదేకదే వక్కన నే నంటితేను
యివలఁ గళ దాఁకెనో హితవో కాని
తివిరి శ్రీవేంకటాద్రిదేవుఁడ నేఁ గూడితి
చవిగొనీ మోవిపొందో చనవో కాని
(||pallavi||)
ĕṁta ĕṁta sesīne yem̐ṭige nādo
paṁtamulu nĕrabīno paigŏnīno kāni
(||ĕṁta||)
kanurĕppa vesīm̐gadĕ kāṁta danu nem̐ jūside
sĕnagīni kobamo siggo kāni
sanum̐gŏṁgu mūsīm̐gade sarasa nem̐ gūsuṁḍide
vĕnaga nānerālago vesālago kāni
(||ĕṁta||)
tala vaṁchugŏnīm̐gade tanalo ne māḍāḍide
balimi rājasamo parāgo kāni
kilagila navvīm̐gade kelu sem̐ baṭṭi tīside
kĕlanivāru mĕchchano keraḍamo kāni
(||ĕda||)
pavaḽaṅiṁchī nadegade vakkana ne naṁṭidenu
yivalam̐ gaḽa dām̐kĕno hidavo kāni
tiviri śhrīveṁkaḍādridevum̐ḍa nem̐ gūḍidi
savigŏnī movibŏṁdo sanavo kāni