ఎంత దవ్వయిననేమి ఇక్కడ నుండిననేమి
(॥పల్లవి॥)
ఎంత దవ్వయిననేమి ఇక్కడ నుండిననేమి
చింత వొక్కటైనప్పుడే చేరువౌటగాదా
(॥ఎంత॥)
విన్ను నంటినట్టిగాలి నేఁడు నామీఁదఁ బొలసె
యెన్న నది యిద్దరికి నేకము గాదా
ఇన్నిటా నొకచందురు నిద్దరముఁ జూచితిమి
కన్నులచూపిదరికిఁ గలయుటే కాదా
(॥ఎంత॥)
యిద్దరి యెలుఁగులకు యీయాకసమె గురి
అద్ది మనయిదియె మాటాడుటగాదా
పొద్దుపొడ పొక్కటే పొంచి యీయింటా నాయింటా
వొద్దనుండి నట్టేకాదా వొరసిన భేదమా
(॥ఎంత॥)
భావజునమ్ములే కావా పలుమారు సోఁకేవి
చేవదేరె నవె పూవు సేసలు గావా
శ్రీ వేంకటేశ నీవే చేకొని కూడితి నన్ను
యీవేళలకు నిదె హితవు గాదా
(||pallavi||)
ĕṁta davvayinanemi ikkaḍa nuṁḍinanemi
siṁta vŏkkaḍainappuḍe seruvauḍagādā
(||ĕṁta||)
vinnu naṁṭinaṭṭigāli nem̐ḍu nāmīm̐dam̐ bŏlasĕ
yĕnna nadi yiddarigi negamu gādā
inniḍā nŏgasaṁduru niddaramum̐ jūsidimi
kannulasūbidarigim̐ galayuḍe kādā
(||ĕṁta||)
yiddari yĕlum̐gulagu yīyāgasamĕ guri
addi manayidiyĕ māḍāḍuḍagādā
pŏddubŏḍa pŏkkaḍe pŏṁchi yīyiṁṭā nāyiṁṭā
vŏddanuṁḍi naṭṭegādā vŏrasina bhedamā
(||ĕṁta||)
bhāvajunammule kāvā palumāru som̐kevi
sevaderĕ navĕ pūvu sesalu gāvā
śhrī veṁkaḍeśha nīve segŏni kūḍidi nannu
yīveḽalagu nidĕ hidavu gādā